District News

నగరంలో పేదలు నివశించే కాలనీలలో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ప్రజా సమస్యల అధ్యయనం, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి వత్తిడి తెచ్చేందుకు సిపియం నగరంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి మూడోరోజుకు చేరుకుంది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పాదయాత్రలో పాశం రామారావు పాల్గొని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని సాయిబాబు కాలనీ, చంద్రబాబు కాలనీ, హూస్సేన్‌ నగర్‌, ఆనందపేటల్లో పర్యటించారు.రామారావు మాట్లాడుతూ తూర్పు నియోజక వర్గం శివారు కాలనీల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని నివాసముంటున్న వారికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్లు,...

నగరంలో సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రెండో రోజుకు చేరుకున్నాయి.. నాయకులు వీధివీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారులకు సమస్యలు అనేక సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ తమ కాలనీల్లో తొంగి చూడట్లేదని వారు పాదయాత్ర బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాల్వలు, మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజక వర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మురికి వాడలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, తక్షణమే ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యాత్ర సంగటిగుంట...

గ్రామాల్లో వెంటనే కూలిపనులు లేని పేదలందరికీ ఉపాధి హామీ పనులు చూపించి వలసలను అరికట్టాలని సిపిఎం పార్టీ డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజు సత్తెనపల్లి మండలంలోని కట్టావారిపాలెం, పెదమక్కెన, గుడిపూడి, నందిగం, భీమవరం గ్రామాల్లో సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని, తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చూపించాలని గ్రామస్తులు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పెదమక్కెనలోని ఎస్సీకాలనీవాసులు రాజకీయ కక్ష్యతో దళితులకు ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఇవ్వలేదన్నారు. వెంటనే తమకు జాబ్‌కార్డులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని...

రేపల్లె డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రేపల్లెలో సోమవారం ప్రారంభమయ్యాయి. యాత్రను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బిఎల్‌కె.ప్రసాదు ప్రారంభించగా జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ మాట్లాడారు. పట్టణంలో అనేక సమస్యలున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, ఒకటో వార్డు రెండో వార్డు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 14 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా నేటికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క ప్రభుత్వ కుళాయి కూడా లేదని అన్నారు. అర్హతున్నా పింఛన్లు రానివారు ప్రతివార్డులోనూ ఉన్నారని, రెండేళ్లుగా...

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ఎం.పకీరయ్య అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వం వారి నుంచి భూములను సమీకరించి ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల్లేక వెలవెలబోతున్న యూని వర్సిటీలను సంరక్షించకుండా...

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నగరంలో మురికివాడల్లో సమస్యలు తిష్ట వేశాయని, టిడిపి తన ఎన్నికల వాగ్దానాలు మరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. 24వ తేదీ వరకు నగరంలో సిపిఎం నిర్వహించే పాదయాత్రలు ఆదివారం సంగడిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో పాశం రామారావు మాట్లాడుతూ టిడిపి తన మ్యానిఫెస్టోలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇస్తామని రెండున్నరేళ్ల పరిపాలనలో ఒక్క సెంటు కూడా పంపిణీ చేయలేదన్నారు. నగరంలో 35 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు. మరో 5 వేల కుటుంబాలు రైల్వే ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారని, ఆయా స్థలాలకు పట్టాలు...

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్‌ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్‌ పరుచూరి నాగేశ్వరరావు భవన్‌) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు. కూలి, చేనేత, దేవాదాయ భూముల ఉద్యమ విజయాల్లో నాగేశ్వరరావు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఎందరికో ఉద్యమపాఠాలు నేర్పారని తెలిపారు. తానూ ఆయనతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు....

రోజురోజుకూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలోనూ, నిరుద్యోగాన్ని అరికట్టడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు వేమారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం దేవాపురంలో అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నిరనన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం కల్పించడంలేదని అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో నరేంద్ర మోడీ, రాజధాని పేరులో చంద్రబాబునాయుడు వేల ఎకరాలను...

Pages