రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు.