2018

విజయవాడ వాంబే కాలనీలో ప్రజా రక్షణ యాత్ర

విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో ముఖాముఖి

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాని మార్పు చేసి రైతుల నుండి బలవంతంగా భూమి గుంజుకుంటుందని అన్నారు. భూసేకరణ చట్టంలో రైతుల నుండి భూమి తీసుకున్న తర్వాత 5సంవత్సరలోపు ఎటువంటి పనులు ఆభూములలో చేయకపోతే తిరిగిరైతుకు భూమి ఇవ్వాలని ఉందని కానీ చంద్రబాబు భూసేకరణ చట్టసవరణ ద్వారా ఆ విషయాన్ని చట్టం నుండి తొలగించారని అన్నారు.. రైతులకు అండగా సిపిఎం ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

ప్రత్యేకహోదా కోసం వై ఎస్ స్సార్ సిపి చేస్తున్న బంద్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సీపీఎం ఖండిస్తోంది

సమాన విద్య, ఉపాధి కల్పించాల్సిందే - తిరుపతి సభలో మంతేన సీతారాం

సమాన విద్య-ఉపాధి గ్యారంటీ కోసం రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సమాన విద్య-ఉపాధి గ్యారెంటీ కోసం వామపక్ష పార్టీల రాజకీయ ప్రత్యామ్నాయంపై తిరుపతి యశోధనగర్‌లోని ఎంబి భవన్‌లోకోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. దీనికి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నంపెంచులయ్య అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ దివాళాకోరుతనానికి బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.

'ప్రకాశం' వెనుకబాటుపై రాష్ట్రస్థాయి ఉద్యమం

అన్ని విధాలా వెనుకబాటుకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ది కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని వామ పక్ష నేతలు ప్రకటించారు. జిల్లాను అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురిచేసిన పాలక, ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదన్నారు. రాష్ట్రానికి హోదా కావాలని కోరుతున్న ముఖ్యమంత్రికి వెనుకబడిన జిల్లాలు గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. అభివృద్ధిని కోరే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

ప్రజాసమస్యల పరిష్కరానికై విజయవాడలో ప్రజారక్షణ పాదయాత్ర

సిఎం చంద్రబాబు పాలన వ్యాపారమయంగా మారిపోయిందని, పౌర సేవలను డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ఆదివారం విజయవాడలోని 45వ డివిజన్‌ మధురానగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరించడానికి చేపట్టిన ప్రజారక్షణ యాత్రకు అందరూ మద్దతు తెలిపాలని కోరారు.

Pages

Subscribe to RSS - 2018