వరదల వల్ల, కరువు ప్రాంతాలలో నష్టపోయిన వాస్తవ సాగుదారులు, కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఎం కేంద్రకమిటి సభ్యులు వి. శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుల వలన, వర్షాల వల్ల సంభవించిన వరదలు వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. కరువు, వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకోకపోతే వ్యవసాయం గట్టెక్కదు. ముఖ్యమంత్రి వరదల ప్రాంతాలలో సందర్శించి రైతులకు ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం అన్యాయం అన్నారు.