June

టీడీపీ నాయకులు ఇప్పుడేమయ్యారు ?

పరిశ్రమ యాజమాన్యం తరఫున ర్యాలీలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్మికులకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా ఏమయ్యారని సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిగి మండలంలోని ఎస్‌ఏ రావతార్ పరిశ్రమ యాజమాన్యం చట్టాలు, రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాలకార్మిక చట్టానికి విరుద్ధంగా 10 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా పని కల్పిస్తోందని మండిపడ్డారు.

సియోల్‌ ప్లీనరీ..ఫలించని భారత్‌ యత్నాలు

అంతర్జాతీయ అణ్వ్తస్తాలు వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే ఎన్‌పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) ని పూర్తి స్థాయిలో, సమర్ధవంతంగా అమలు చేయడమే కీలకమని సియోల్‌ ప్లీనరీ సమావేశాలు ప్రకటించాయి. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అంటే భారత్‌కు అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం ఇచ్చే విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండబోవని దీంతో స్పష్టమైంది

పన్సారే కేసులో స్టే పొడిగింపు..

హేతువాది గోవింద్‌ పన్సారే హత్య కేసులో అరెస్టు అయిన హిందూ గ్రూపు కార్యకర్త సమీర్‌ గైక్వాడ్‌పై అభియోగాల నమోదుపై విధించిన స్టేను బొంబాయి హైకోర్టు పొడిగించింది. బ్రిటన్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ప్రాసిక్యూషన్‌ వేచిచూస్తుండటంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఢిల్లీకి ప్రత్యేక హోదాపై రెఫరెండం:కేజ్రీ

 ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ రిఫరెండంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో కేజ్రీవాల్‌... ఢిల్లీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదాపై ప్రజల మనోభిష్టాన్ని తెలుసుకునేందుకు అలాంటి రెఫరెండంను దేశ రాజధానిలో నిర్వహించాలని కేజ్రీ భావిస్తున్నారు. 

రూ.14 కోట్ల బకాయిలు చెల్లించండి..

అనంతపురం జిల్లా పాల ఉత్పత్తిదారులకు ఏపి పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. సేకరణ ధర తగ్గింపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వరుస కరవులతో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా లో ఆత్మహత్యలు, వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత, పాడి పరిశ్రమ ప్రధాన జీవనా ధారంగా ఉందన్నారు.

కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె

వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

స‌దావ‌ర్తి స‌త్రం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచారించాలి. సిపియం జిల్లా కార్య‌ద‌ర్శి పాశం రామారావు.

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌.

Pages

Subscribe to RSS - June