
పరిశ్రమ యాజమాన్యం తరఫున ర్యాలీలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్మికులకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా ఏమయ్యారని సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిగి మండలంలోని ఎస్‌ఏ రావతార్ పరిశ్రమ యాజమాన్యం చట్టాలు, రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాలకార్మిక చట్టానికి విరుద్ధంగా 10 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా పని కల్పిస్తోందని మండిపడ్డారు.