District News

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాబోయే ఏడాది కాలంలో విద్యా, ఉపాధి, సామాజిక అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని...

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు. కంపెనీలు ఎకరా మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని చెప్పారు. రూ.3 కోట్ల విలువజేసే...

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఉత్సవాలు కాదు... అభివృద్ధిపై కార్యచరణ కావాలి' అని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం నాటితో రెండో రోజుకు చేరుకుంది. పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, ఎస్కేయూ మీదుగా సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతిచోటా విద్యార్థులు, యువకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రసంగాలు చేసిన అన్ని ప్రధాన కూడళ్లలోనూ జనం ఆసక్తిగా నాయకుల ప్రసంగాలను విన్నారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టినప్పుడు చప్పట్లో తమ మద్దతును తెలియజేశారు. రెండో రోజు జరిగిన యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి...

 రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ...

రాయలసీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో కొనసాగింది. 
పుట్టపర్తి అర్బన్‌:రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీ కోసం మార్చి 15న అసెంబ్లీని ముట్టడిస్తామని, ఇందులో అరెస్ట్‌లకు కూడా సిద్ధమని సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకలు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం బస్సు యాత్ర పుట్టపర్తికి చేరుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్‌ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ప్రజలను ఉద్ధేశించి...

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు చేపట్టిన ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువులో అంబేద్కర్‌...

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాజకీయ స్వార్థం, అధికారం దాహం కోసం మతచిచ్చు, కుల చిచ్చు...

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సంక్షేమ పథకాలను టిడిపి అనునూయులు మాత్రమే లబ్ధిపొందేలా ప్రభుత్వం కుట్ర పూరితమైన కక్షసాధింపుతో ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జన్మభూమి...

Pages