District News

రాష్ట్రంలోని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికిస్తున్న మెస్‌ ఛార్జీ రూ.750 నుంచి రూ.1500లకు పెంచాలని, 50 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే సాకుతో మూసివేసిన 220 హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతపురం, కర్నూలు, కడప కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. కర్నూల్లో పదిమందిని అరెస్టు చేశారు. అనంతపురంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్‌ చేరుకొని ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్లు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈక్రమంలో...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రముఖ పరిశ్రమ రానుంది. విమానాలను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్ బస్ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 49.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, జీవో నం. 264ను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో స్థలం కేటాయించారు. ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఎయిర్ బస్ చెల్లించనుంది. కాగా, ఈ స్థలానికి ఆనుకొని ఉన్న మరో 150 ఎకరాల స్థలాన్ని కూడా ఎయిర్ బస్ కోరుతోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ అధీనంలోని భూమిని ఎయిర్ బస్ కు అప్పగించిన ఏపీ సర్కారు, మిగతా భూమిని సైతం అందించే దిశగా ఆలోచనలు చేస్తోంది. 

 

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి
         రాయలసీమకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. లోటు బడ్జెట్‌ను పూరిస్తామని చట్టంలో ఉందని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చట్టంలో ఉందని, ఇచ్చిన హామీ మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర విద్యా సంస్థలతోపాటు వృత్తి శిక్షణనిచ్చే...

 

అనంతపురం: హంద్రీ-నీవా నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఉరవకొండలో రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధాని నిర్మాణంతో వ్యాపారాలూ చేస్తూ... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలైన ఎస్పీవై రెడ్డి, పుల్లారెడ్డిలకు రూ.2.150 కోట్ల విద్యుత్ రాయితీలు కల్పించిన ప్రభుత్వం మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడేందుకు ఇష్టపడటం లేదని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీ ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా రాదని, చంద్రబాబు సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలందరికీ ముందే తెలిసినా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్ని స్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి అభిప్రాయ పడ్డారు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం సందర్భంగా శనివారం విజయవాడ వచ్చిన ఎంపీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా, ఉనప్పుడు మరో విధంగా మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నేడు అనంతపురం ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర చంద్రదండు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో చంద్రదండు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాజ్యసభ సీటు కోసమే రఘువీరా రెడ్డి రాహుల్‌ గాంధీతో పాదయాత్రలు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మాట్లాడుతూ అనంతపురానికి ఆనుకొని ఉన్న కర్నాటకలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్‌ గాంధీ అక్కడ ఎందుకు యాత్రలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ లు కేవలం అనంతపురం, హిందూపూర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80...

Pages