District News

ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి లంక భూములను సేకరించడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.1 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.

రాజధాని పనులకు ఇంతవరకు ఒక్క టెండరూ ఖరారు చేయలేదు. కేవలం కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియ మినహా ఇతర టెండర్లను ఖారారు చేయలేదు. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధాన ప్రధాన రహదారికే ఇంతవరకు స్పష్టత లేదని అధికారులే వాపోతున్నారు. కన్సల్టెంట్లు కూడా రాజధాని కేంద్ర ప్రాంతం నుండి కొండవీటివాగు స్లూయిస్‌ వరకూ ప్లానింగ్‌ ఇచ్చారు. అక్కడి నుండి జాతీయ రహదారికి అనుసంధాన రహదారిని ఫైనల్‌ చేయలేదు. అధికారులు మాత్రం మణిపాల్‌ ఆస్పత్రి వెనుక భాగంలోనూ, వడ్డేశ్వరం సమీపంలోనూ భూ పటుత్వ పరీక్షల కోసం పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రోడ్డు ఎక్కడ వేయాలనేది స్పష్టం చేయలేదు. రోడ్లకు సర్వే చేసిన కంపెనీ ఇటీవల మూడు ప్రతిపాదనలు చేసింది. మణిపాల్‌...

 రాజధాని అభివృద్ధి పనులు చేపట్టడానికి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని రిజర్వు ఫారెస్టు ఏరియాని సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు కౌన్సిల్‌ ఆమోదించింది. తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వు ఫారెస్టు ఏరియాలో 1032 నివాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేయాలనీ కౌన్సిల్‌ తీర్మానించింది. అలాగే, ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్‌షాపు వైజంక్షన్‌ వద్ద రూ.14లక్షల 50 వేల వ్యయంతో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయడానికి రూపొందించిన అంచనాలను ఆమోదించారు.

ఇప్పటికే బ్రిటనతో సహా పలు బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీఎం చంద్రబాబును కలిసి హామీలు ఇస్తున్నందున రుణాల మంజూరుకు పెద్దగా అవరోధాలు ఎదురయ్యే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది. రాజధాని నగర నిర్మాణం కోసం ప్రాథమికంగా రూ.15,000 కోట్ల విదేశీ రుణం అవసరమవుతుందని కమిటీ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, జేబీఎ్‌ససీ, జైకా, బీఎ్‌సఐసీ వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన, కమిషనర్‌ శ్రీకాంతకు పీవీ రమేశ్‌ సూచించారు

మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కోసం గురువారం ఏర్పాటైన సదస్సులో రైతుల ప్రశ్నలకు మంత్రులుగాని, అధికారులుగాని సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో తమ భవిషత్తు ఏమిటో తెలియక రైతుల్లో అయోమయం ఏర్పడింది. సమీకరణలో భూములిచ్చిన వారికి కేటాయిస్తామన్న స్థలాలు ఇవ్వలేదు. కనీసం ఎక్కడ ఇస్తారో కూడా చెప్పటంలేదు. ఇంకా చర్చించాలంటున్నారు. ఇంతవరకు సిఆర్‌డిఎ మండల స్థాయి రికార్డుల ఆధారంగా సర్వే చేయలేదు. పూలింగులో ఇచ్చిన భూములు, రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాల్లో ఏమైనా హెచ్చుతగ్గులుంటే ఈ సర్వేలో బయటపడతాయి. దీన్ని ఈ నెలలో చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ కంఠాల సమస్యనూ పరిష్కరించలేదు. పూలింగు సమయంలో నిరంతరం గ్రామాల్లో తిరిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు...

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా వామపక్షాలు నిరసన గళమెత్తాయి. ధరలను నియంత్రించకపొతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని, ప్రజాప్రతిఘటన తప్పదని హెచ్చారించాయి. రాష్ట్ర వ్యాపితంగా అధిక ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో టిడిపిలు ఎన్నికల ముందు వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామని ప్రగల్బాలు పలికి, నేడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. కందిపప్పు, బియ్యం, చింతపండు, ఉల్లిపాయలు,...

 ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతరం పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మట్టి సత్యాగ్రహాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది చేత మట్టిని సేకరించి మోదీకి పంపుతామని రఘువీరారెడ్డి అన్నారు.

రాజధానికి శంకుస్థాపన జరిగిన గ్రామాల్లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పేదలకివ్వాల్సిన పెన్షన్లు ఎగ్గొట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇటీవల నిరు పేద దళితులకు పొలాలున్నాయంటూ పెన్షన్లు ఆపేశారు. ఈ సమస్య శంకుస్థాపన చేసిన గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. పేద దళితులకు కనీసం పని కూడా కల్పించటం లేదు. వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమకు పొలాలు లేకపోయినా ఉన్నాయనే పేరుతో పెన్షన్లు ఎత్తేశారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలినెలలో అర్హులుగా గుర్తించి, రెండోనెల నుండి పింఛన్లు ఇవ్వడం లేదని, అదేమంటే తమకు పొలాలున్నాయని అంటున్నారని పేదలు వాపోతున్నారు. పొలాలు ఎక్కడున్నాయో చెబితే దానికి తగిన...

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ మరోసారి మాట తప్పింది. వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలున్న రైతులకు కోరిన రెవెన్యూలో ఒకేచోట స్థలం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అటువంటిదేమీ లేదని ప్రకటించింది. కుటుంబంలో ఒకే గ్రామ పరిధిలో వేర్వేరు పేర్ల మీద ప్లాట్లు ఇచ్చిన యజమానులు ఒకే చోట భూములు కావాలనుకుంటే ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. జనవరి రెండోతేదీన నేలపాడులో పూలింగు ప్రక్రియ ప్రారంభించారు. అప్పట్లో వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములున్న రైతులు తమకు ఒకేచోట భూములు కావాలని కోరారు. దీనికి మంత్రులు అంగీకరించారు. వేర్వేరు చోట్ల భూములున్న వారందరూ తహశీల్దార్‌కు తమ అంగీకార పత్రాలు సమర్పించాలని, వారందరికీ కోరుకున్న...

భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. నోటిఫికేషన్‌ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వ సిద్ధం కావడంతో ఎకరం 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూములకు 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. పట్టా భూములను ఎకరం 45...

Pages