District News

రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకుగానీ, దానికి సాంకేతిక సలహా ఇచ్చేందుకుగానీ చేసుకున్న ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే చెందినవి కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మొత్తం మాస్టర్‌ డెవలపర్‌పేరుతో సింగపూర్‌కు కట్టబెట్టగా, రాష్ట్రంలో కోస్తాతీరంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను జపాన్‌కు అప్పగిస్తోంది. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు బాధ్యతతో పాటు అత్యంత కీలకమైన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటునూ జపాన్‌కు అప్పగించింది. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునీకరణకు జపాన్‌ సాయం తీసుకోనుంది. ఇది ఆందోళన కలిగించే అంశమని మాజీమంత్రి, వ్యవసాయరంగ...

అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాజధాని ప్రాంతం తుళ్లూరులో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలతోపాటు, శాసనమండలి సమావేశాలూ తుళ్లూరులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడూతూ ప్రధాని మోడి రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్థాడని ప్రజలు ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పైనా, ఆర్ధికంగా,...

నవ్యాంధ్ర రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులు ఒక పక్క, ప్రభుత్వ రాజధాని నిర్మాణం ఆడంబరం మరోపక్క, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఇంకోపక్క ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లో నిర్వహించిన సిపిఎం నాయకులు మేకా అమరారెడ్డి 34వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటే శ్వరరావు అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 4వేల ఎకరాల్లో వచ్చే పదేళ్లలో రాజధాని నిర్మాణం చేస్తానని చెబుతున్న నేపథ్యంలో రైతుల నుండి 33వేల ఎకరాలు సేకరించి మొత్తం లక్ష ఎకరాలు భూములు సేకరించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం...

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలకు బీహార్‌ సైతం నివ్వెరపో తోందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై 10 నెలల్లో 13 సంఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఇటీవల దహనమైన చెరకు తోటను సోమవారం ఆయన తమ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూములివ్వని రైతుల పంటలు తగుల బెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని సిపిఎం నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు కార్యక్రమానికి హాజరవుతారన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణా నికి అవ సరమైన పర్యావరణ ఆమోదాన్ని సక్రమ మైన పద్ధతిలో పొందలేదని పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలువి మర్శిస్తున్నాయి. స్టేట్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌ అథారిటీ(ఎస్‌ఇఐఎఎ)కి రాజధాని పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని నిబంధనలు రూపొందించకుండా క్రిడా పర్యావరణ ఆమోదాన్ని ఎలా పొందిందని నిపు ణులు విమర్శిస్తున్నారు. కన్సల్టెంట్‌ను నియమించ కుండా, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించకు ండా పర్యావరణ క్లియరెెన్స్‌ ఎలా లభిస్తుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడిపై రెగ్యులేటరీ ఏజెన్సీ కాగితంపై రబ్బర్‌ స్టాంప్‌ వేసి ఇచ్చిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పర్యావరణ ప్రభా వ నివేదికను కన్సల్టెంట్‌ ద్వారా...

అర్హులైనవారందరికీ ప్రభుత్వం ప్రకటించిన భూమిలేని నిరుపేదలకు ఇస్తానన్న రూ.2500లు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్దఎత్తున ముట్టడించారు. వందలాదిమంది కార్యాలయం ఆవరణలోకి జొరబడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కాల కార్యకర్తల ప్రమేయం పెరగడం వలనే అనర్హులకు అందలాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 రాజధాని శంకుస్థాపన సంబరాల మధ్య ప్రజా సమస్యలు పక్క కెళ్లిపోతున్నాయి. మంత్రులు, అధి కార యంత్రాంగమంతా కేవలం రాజధాని శంకు స్థాపన మీదే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాధాన్య అరశాలపైనా ఎవరూ స్పరదిరచడం లేదు. వివిధ జిల్లాల్లో రోజూ సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు.దాదాపు అన్ని శాఖల్లోనూ ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. చివరకు ముఖ్యమంత్రి పేషీలో సైతం దాదాపు 18 వేలకుపైగా ఫైళ్లు కదలకుండా ఉన్నట్లు అధికారులే అరగీకరిస్తున్నారు.రాష్ట్రంలోని అనేక ప్రారతాల్లో డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, వైరల్‌ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నా, ప్రభుత్వపరంగా వైద్య సేవలు ఎప్పటిలా అధ్వానంగానే ఉన్నాయి. ఆసుపత్రుల్లోనే కుక్కలు, ఎలుకలు,...

బిసి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌లిమిటెడ్‌ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం లో నిర్మించ తలపెట్టిన ఎరువులు, రసాయనాల కర్మాగారంపై గురువారం నాడు ఫార్సుగా ప్రజాబి ప్రాయ సేకరణ జరిగింది. ప్లాంటుకు సంబంధిం చి నామమాత్రపు వివరాలు కూడా ఇవ్వకుండా అభి ప్రాయాలు సేకరించడంపై తీవ్రస్థాయిలో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమీప బంధువులకు ఈ ప్లాంటులో భాగస్వామ్యం ఉండటంతో హడావిడిగా ఈ తంతు ముగించా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారో, ఎవరి నుండిసాంకేతిక సహకారం తీసుకుంటున్నారో వంటి అంశాలను కూడా ప్రజల కు వివరించకపోవడం గమనార్హం. 
ఇంటర్‌నెట్‌నుండి కాపీ ఈ కంపెనీ తయారు చేయించిన ఎన్వి రాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఇ ఐ...

Pages