2018 డిసెంబర్‌ నాటికి AP అసెంబ్లీ..

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన భవనాల నిర్మాణాలకు వివరణాత్మకంగా నమూనా (డిటైల్డ్‌ అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌)ను రూపొందించనున్నారు. ఏప్రిల్‌ 2017 నాటికి అసెంబ్లీ భవన నిర్మాణ సూక్ష్మ ప్రణాళిక సిద్ధమవుతుంది. 900 ఎకరాల్లో చేపట్టనున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో నిర్మాణాలకు 30 శాతం స్థలాన్ని మాత్రమే వినియోగించనున్నారు. మిగిలిన స్థలాన్ని ల్యాండ ్‌స్కేప్‌, నీటి వనరులు, పార్కులు, పచ్చదనానికి కేటాయిస్తారు. మొత్తం నిర్మాణాల చుట్టూ 32 మీటర్ల వెడల్పుతో బిఆర్‌టిఎస్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు.