రాజధానిలో సంస్కృతి జాడ గల్లంతు..

 అమరావతి.. అదొక ప్రాచీన నగరం. శాతవాహనుల కాలంలో అదే రాజధాని. బౌద్ధానికీ ఆ ప్రారతం నాడు కీలక స్థానం. అలాంటి అమరావతి నేడు రాష్ట్రానికి రాజధానిగా మారి, తన ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొరది. చారిత్రక ప్రాముఖ్యం గల ఆ ప్రారతం ఆధునిక కట్టడాలు రానున్నాయి. గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. 
రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిరచారు. అందుకు జపాన్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, సిరగపూర్‌, మలేషియా వంటి దేశాల వారిని ఆహ్వానిరచి, అద్భుత, ఆధునిక నగరాన్ని నిర్మిరచాలని కోరారు. డిజైన్లు కూడా సిద్ధం చేయిరచారు. కానీ ఆ డిజైన్లలో అరతా విదేశీ పోకడలే కనిపిస్తున్నాయి. స్థానికత్వం, చరిత్ర జ్ఞాపికలు ఎక్కడా లేవని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి కీలక కట్టడాలూ విదేశీ డిజైన్లలోనే ఉరడడంపై ప్రభుత్వంలోనే ఒక వర్గం విస్మయాన్ని వ్యక్తం చేస్తోరది. రాష్ట్ర స్పూర్తికి, సంప్రదాయాలకు నిలయంగా ఉరడాల్సిన శాసనసభ, సచివాలయాల ఆకృతులు పూర్తిగా భిన్నంగా ఉరడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.