District News

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు. జిఒ అమలులోకి వస్తే ప్రభుత్వానికి, కార్మికులకు సంబంధం లేకుండా పోతుందని తెలిపారు. మున్సిపాల్టీల్లో...

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని తుళ్ళూరు గ్రామస్తులు సిఆర్‌డిఎ అధికారులను హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై గురువారం నిర్వహించిన సదస్సులో సిఆర్‌డిఎ ల్యాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవులు, డిజైనింగ్‌ డైరెక్టర్‌ రాముడును గ్రామస్తులు నిలదీశారు. గ్రామకంఠా లపై స్పష్టతివ్వాలని, రైతులకు ప్లాట్లు ఎక్కడ కేటాయించేది మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి మంత్రు లు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే సదస్సులు నిర్వహించాలని, లేకుంటే తాము అంగీకరించ బోమని తేల్చిచెప్పారు..

 

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది. 

రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్‌డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్‌డిఏ అధికారులు తేల్చిచెప్పారు. తమ గ్రామాల్లో భూములివ్వనప్పుడు మేము పొలాలు ఇవ్వబోమని, వెంటనే సాగుచేసుకుంటామని...

రాజధాని నిర్మాణానికి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. 'నా రాజధాని నా అమరావతి నా ఇటుక' కార్యక్రమంలో భాగంగా ఈ వసూళ్లు చేయాలంది. ఈనెల 10లోగా ఈ వసూళ్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రికి అందజేయాలని మోమోలో పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం...

పల్నాడులో నిర్వహించే ప్రజా పోరాటాలకు పిడుగురాళ్లలోని సిఐటియు కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పేర్కొన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన సిఐటియు కార్యాలయం (కన్నెగంటి హనుమంత్‌ భవనం)ను ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ శిలాఫలకాన్ని గఫూర్‌ ఆవిష్కరించగా ప్రధాన గదిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు ప్రారంభించారు. యూనియన్‌ పతాకాన్ని రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు సిఐటియు పల్నాడు ఏరియా కార్యదర్శి గోపాలరావు అధ్యక్షత వహించారు...

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. పూలింగులో ఉన్న శ్రద్ధ తమకు వాటా ఇచ్చే సమయంలో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. జనచైతన్య యాత్రలనూ బహిష్కరిస్తున్నారు.రాజధాని ప్రకటించిన తొలిరోజే భూములిచ్చామని, ఇంతవరకు ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్‌ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామి అన్నారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్‌ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్‌ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు. గతంలో టెర్రిస్టులు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు...

Pages