District News

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్‌ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్‌ పరుచూరి నాగేశ్వరరావు భవన్‌) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు. కూలి, చేనేత, దేవాదాయ భూముల ఉద్యమ విజయాల్లో నాగేశ్వరరావు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఎందరికో ఉద్యమపాఠాలు నేర్పారని తెలిపారు. తానూ ఆయనతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు....

రోజురోజుకూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలోనూ, నిరుద్యోగాన్ని అరికట్టడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు వేమారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం దేవాపురంలో అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నిరనన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం కల్పించడంలేదని అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో నరేంద్ర మోడీ, రాజధాని పేరులో చంద్రబాబునాయుడు వేల ఎకరాలను...

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా బాధితులకు నష్టపరిహారమివ్వాలని, దీనికి బాధ్యతగా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ అధికారులపై...

రైతులకు ప్లాట్లు ఇవ్వడం మొదలుపెట్టాక వాటితో వ్యాపారం చేయించేందుకు సిఆర్‌డిఎ సిద్ధమైంది. ప్లాట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో చర్చలు చేపట్టింది.రైతుల భూముల అభివృద్ధికి ముందుకొస్తే బిల్డర్లకు సిఆర్‌డిఎ నుండి అవసరమైన సహాయం అందిస్తామని, సిఎంతో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైతే చిన్న చిన్న ప్లాట్లు కలుపుకొని పెద్ద కమతాలుగా మార్చుకునేందుకు అవసరమైన నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్‌ కన్సార్టియానికి భూములు కేటాయించే సమయంలోనే రైతుల భూములనూ బిల్డర్లకు కట్టబెట్టించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తం...

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉ‍న్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు.

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు. జిడిపి వృద్ధిరేటు విషయంలో కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతోందని, అన్ని రంగాల్లో రెండు శాతమే వృద్ధి ఉంటే జిడిపి ఏడు శాతం...

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పట్టాదారులైన ఎస్‌సిలకు తెలియకుండానే వారి పేరుతో ఉన్న సొసైటీని రద్దు చేసి సంబంధిత భూములను అధికార పార్టీకి చెందిన నాయకులే స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ముందస్తుగా లభ్దిదారులకు ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంబంధిత అధికారితో సొసైటీని రద్దు చేయటం భావ్యం కాదన్నారు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి పత్తిపాటి...

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌. స‌మారు 480 కోట్లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం 22 కోట్ల‌కే వేలంలో పోంద‌డం అంటే...

Pages