District News

జూన్‌ లోగా నిర్మాణం పూర్తి చేయాలనుకున్న తాత్కాలిక సచివాలయంపై గందరగోళం నెలకొంటోంది. రోజుకో గ్రామం, పూటకో స్థలంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని సృష్టిస్తోంది . అసలు నిర్దిష్ట సమయం లోగా సచివాలయం పూర్తవుతురదా? అనే అనుమా నాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కేటాయిరచాల్సిన స్థలాన్ని రెట్టిరపు చేస్తూ ప్రభుత్వం తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మురదుగా 20 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మిరచాలని నిర్ణయిరచారు. వెలగపూడిలో ఇప్పుడు ఏకంగా ఆ విస్తీర్ణాన్ని 45 ఎకరాల వరకు పెరచుతూ ఉత్తర్వులిచ్చారు. ముందు 20 ఎకరాలని, పబ్లిక్‌ సౌకర్యాల పేరిట దీన్ని 45 ఎకరాలకు పెంచడం ప్రశ్నార్థకమవుతోంది. 

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం నాయకులపై దాడులు చేయటం హేయమైన చర్యని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. మంగళవారం గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన రౌడీషీటర్లు, మాజీ నేరస్తులైన బాజీ, కోటేశ్వరరావులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బస్టాండ్‌ సెంటరులో రౌడీషీటర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ 2007లో సిపిఎం నాయకుల కృషితో సుందరయ్య కాలనీ ఏర్పడిందని, అప్పటి నుంచి పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న బాజీ, కోటేశ్వరరావు అనే రౌడీషీటర్లు ప్రయత్నిస్తుండటంతో వారిని అడ్డుకునేందుకు సిపిఎం కార్యదర్శి కె.ఆంజనేయులు పార్టీ సహకారంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అతనిపై అమానుషంగా హత్యాయత్యానికి పాల్పడిన రౌడీషీటర్లను వెంటనే...

గుంటూరులో సిపిఎం నాయకులపై టిడిపి గూండాలు హత్యాయత్నాన్ని నిరసనగా మంగళగిరి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్లో టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేశారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో పట్టణ ఎస్‌ఐ షేక్‌ జిలాని పోలీసులతో వచ్చి గడ్డిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, సిపిఎం నాయకులకు వాగ్వివాదం జరిగింది. రౌడీషీట్‌ గడ్డిబొమ్మను దహనం చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు విమర్శించారు. రౌడీషీటర్లకు పోలీసులు అండగా ఉంటారా అని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వివాదం అనంతరం సిఐ బి.బ్రహ్మయ్య...

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుని పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడిని కలుసుకుని ఆంజనేయులు ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాడిలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సతీష్‌నూ పరామర్శించారు. ఆంజనేయులు భార్య మల్లేశ్వరితో మాట్లాడారు. పార్టీ అండగా నిలుస్తుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పేదల కాలనీలను దౌర్జన్యంగా తరిమేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రౌడీషీటర్ల విషయంలో సరైన విధంగా స్పందించని తాలూకా సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అసాంఘిక...

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సుందరయ్యనగర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఘటన...

గుంటూరు సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు. జిఒ అమలులోకి వస్తే ప్రభుత్వానికి, కార్మికులకు సంబంధం లేకుండా పోతుందని తెలిపారు. మున్సిపాల్టీల్లో...

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని తుళ్ళూరు గ్రామస్తులు సిఆర్‌డిఎ అధికారులను హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై గురువారం నిర్వహించిన సదస్సులో సిఆర్‌డిఎ ల్యాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవులు, డిజైనింగ్‌ డైరెక్టర్‌ రాముడును గ్రామస్తులు నిలదీశారు. గ్రామకంఠా లపై స్పష్టతివ్వాలని, రైతులకు ప్లాట్లు ఎక్కడ కేటాయించేది మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి మంత్రు లు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే సదస్సులు నిర్వహించాలని, లేకుంటే తాము అంగీకరించ బోమని తేల్చిచెప్పారు..

 

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది. 

Pages