District News

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు. దుకాణాలు, వ్యాపారులు, వ్యక్తుల వద్ద అధికార పార్టీ నాయకులు బెదిరింపు వసూళ్లకు పాల్పడడమే కాకుండా ఏకంగా కళాశాల స్థలాన్నే కొద్ది...

కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జంపని వెంకటేశ్వర్లు కళావేదికపై నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు, పేద బడుగు వర్గాల హక్కుల కోసం...

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు రాజ్యమేలడం దేశ లౌకిక విధానానికి తీవ్ర విఘాతమని లౌకిక, ప్రజాతంత్ర...

సచివాలయ నిర్మాణ పనుల్లో చట్టాలను అమలు చేయాలని, నిర్భంధాలు వద్దనే డిమాండ్లతో గుంటూరులో రాజకీయ, ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని పేరుతో కార్మికులతో కార్పొరేట్‌ కంపెనీలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు.. రాజధాని నిర్మాణ అంశం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టాలన్నారు

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ సీపీఎం నేతలు రాజధాని యాత్ర చేపట్టారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. 

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..

 అమరావతి.. అదొక ప్రాచీన నగరం. శాతవాహనుల కాలంలో అదే రాజధాని. బౌద్ధానికీ ఆ ప్రారతం నాడు కీలక స్థానం. అలాంటి అమరావతి నేడు రాష్ట్రానికి రాజధానిగా మారి, తన ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొరది. చారిత్రక ప్రాముఖ్యం గల ఆ ప్రారతం ఆధునిక కట్టడాలు రానున్నాయి. గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. 
రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిరచారు. అందుకు జపాన్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, సిరగపూర్‌, మలేషియా వంటి దేశాల వారిని ఆహ్వానిరచి, అద్భుత, ఆధునిక నగరాన్ని నిర్మిరచాలని కోరారు. డిజైన్లు కూడా సిద్ధం చేయిరచారు. కానీ ఆ డిజైన్లలో అరతా విదేశీ పోకడలే కనిపిస్తున్నాయి. స్థానికత్వం, చరిత్ర జ్ఞాపికలు ఎక్కడా లేవని సర్వత్రా...

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన భవనాల నిర్మాణాలకు వివరణాత్మకంగా నమూనా (డిటైల్డ్‌ అర్బన్‌ డిజైన్...

Pages