రైతు భరోసా నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఒబిసి మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే సహాయం అందుతుంది. అగ్ర కులాల్లోని పేద రైతులు ముందుగా మినహాయించబడ్డారు. తరువాత మిగిలిన వారిలో ఆ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఈ సహాయం అందదు. అన్నదమ్ములో, తండ్రీ కొడుకులో ఒకే కుటుంబం అన్న పేరుతో కోత పెడుతున్నారు. దరఖాస్తులన్నీ ఇలా ఒడపోసి ఐదవ వంతుకు తగ్గిస్తే ఉన్న వాటికి భూ యజమాని సంతకం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఈ అవాంతరాలన్నీ దాటుకొని ఎంత మందికి భరోసా సహాయం దక్కుతుందో చూడాలి.