మనది లౌకిక రాజ్యం. దాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు బిజెపి బుల్డోజరు రాజకీయాలను నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ తరహా ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి చేస్తున్నది. రాష్ట్ర ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శోభాయాత్ర వంటి పేర్లతో భక్తులను సమీకరించి పరమత ద్వేషాన్ని, మైనార్టీ వ్యతిరేకతను నూరిపోసేందుకు ప్రయత్నించారు. రాజకీయ పొత్తు పేరుతో జనసైనికుల్ని పావులుగా మార్చుకుంటున్నది. ఈ యాత్రలలో వైసిపి, టిడిపి నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు.