District News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

కార్మిక సంఘాలు, కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించు కున్న కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 11 రాష్ట్రాలలో కార్మిక చట్టాలలో సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో పాలిషింగ్‌ యూనిట్‌లలో పనిచేసే కార్మికులు 70 వేల మంది ఉన్నారు. కార్మిక చట్టాలలో సవరణ చేస్తే 30 వేల నుంచి 40 వేల మంది కార్మికులు హక్కులను కోల్పోతారు. అసంఘటిత రంగ కార్మికులు నాలుగు లక్షల మంది జిల్లాలో...

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్‌ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్‌ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నెల్లూరు బస్టాండ్‌, కలెక్టరేట్‌, చర్చి సెంటర్‌, మిరియాలపాలెం సెంటర్‌, పాత కూరగాయల మార్కెట్‌ నుండి అద్దంకి బస్టాండ్‌ వరకు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో సభ...

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం ప్రచారోద్యమం ప్రారంభించింది. స్థానిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకెళ్లి అభివృద్ధికి ఆటంకాలేమిటన్న దానిపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజా చైతన్య సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు.

Pages