District News

నాలుగొందల శతాబ్ధాల చరిత్రకలిగిన హైదరాబాద్‌ ఆర్ధిక వివర్తన, అమరావతిలో ఆచరణసాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఒంగోలులో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరి అవసరంలేదనే వాదన అర్థంలేనిదని అన్నారు.

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు చైర్మన్‌, కమిటీ సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై...

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల తొలగింపు చర్యలు మానుకోవాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం...

గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్‌ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్‌ హానీఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి. అందుకు భిన్నంగా ఎనిమిది మందితో మాత్రమే ఆమోదించి భూమి లాగేసుకున్నారు. ఇది...

'రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యుల రైజ్‌ చేయాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పక్షాలనూ కలుపుకొని చలో అసెంబ్లీ నిర్వహిస్తాం' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుంటే కేవలం మూడు వేలమందే ఉన్నారంటూ మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించడం దారుణ మన్నారు. వారినే రెగ్యులర్‌ చేస్తామనడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేయా లని చూస్తే మహిళలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ప్రకటించిన ప్రకారం వారి వేతనాలు పెంచుతూ జిఓ విడుదల చేయాలని డిమాండ్‌...

అసంఘటిర రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో గపూర్‌ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు పెంచిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. 

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు. దొనకొండలో అధికా రులు చేసిన సర్వేపై సరైన పరిశీలన లేకుండానే 25 వేల ఎకరాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేయ డం సరికాదన్నారు. గత ప్రభుత్వం భూ పంపిణీలో ఇచ్చిన వాటిని...

రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌పై ఉన్న యావ ప్రజల సమస్యలపై లేదన్నారు. రాజధాని శంకుస్థాపన ఆర్భాటానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిం చడం అవసరమా అని ప్రశ్నిం చారు. శంకుస్థాపనకే రూ.400 కోట్లు, అతిథి మర్యాదలకు రూ.2.5కోట్లు, వేదికపై యాంకర్లకు రూ.10 కోట్లు కేటాయించారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో.. ఈ ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు.

కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరు చెప్పి బహుళజాతి కంపెనీలకు, పెద్దపెద్ద...

Pages