District News

సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలులో థర్డ్ వేవ్ కోవిడ్- ఒమిక్రాన్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం -హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ పేషేంట్లకు ఆన్లైన్లో వైద్య సాయం -సేవలందించనున్న 14 మంది వైద్య బృందం -హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండనున్న వాలంటీర్లు - పేదరోగులకు ఉచితంగా మందులు ఇవ్వనున్న హెల్ప్ లైన్ సెంటర్ నిర్వాహకులు కరోనా , ఒమిక్రాన్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న వేళ ప్రజలకు సేవచేయాలనే తలంపుతో సిపిఎం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటుచేసింది .

వరద ప్రాంతాల్లో సిపిఎం నాయకుల పర్యాటన.. ప్రకాశం జిల్లా ఉప్పుగుందూరులో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న మిర్చి, మినుము పంటను రైతులతో కలిసి పరిశీలించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు.వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు, షేక్ మాబు, జయంతి బాబు, మండల కార్యదర్శి తూబాటి శ్రీకాంత్ తదితరులు.

అన్ని విధాలా వెనుకబాటుకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ది కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని వామ పక్ష నేతలు ప్రకటించారు. జిల్లాను అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురిచేసిన పాలక, ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదన్నారు. రాష్ట్రానికి హోదా కావాలని కోరుతున్న ముఖ్యమంత్రికి వెనుకబడిన జిల్లాలు గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. అభివృద్ధిని కోరే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏటీసీ హాలులో జరి గిన సదస్సుకు సిపిఎం ప్రకాశం జిల్లా (తూర్పుప్రాంత) కమిటీ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్‌.నారాయణ అధ్యక్షత...

దేవరపల్లి దళుతుల భూపోరాటానికి మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వి, రాష్ట్ర కమిటి సభ్యులు సిద్దయ్య తదితర స్థానిక నాయకులు పర్యటించారు. దళితుల భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని,70 సం|| రాలుగా దళితులు  సాగుచేసుకున్న భూమి వారికే దక్కేవరకూ సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.   

 ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులను నిర్బంధించి వారి భూములను సాగు చేసుకుంటున్నారనే విషయం తెలుసుకుని వారికి మద్దతుగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నాయకులు వై.వెంకటేశ్వరరావులను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి.అధికార యంత్రాంగం పెత్తందారులకు మద్దతుగా పోలీసులను పంపించి వారి పహారాలో దళితుల భూముల్లో చెరువులు తవ్వుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, దేవరపల్లి దళితులు సాగులో ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పార్టీ శ్రేణులను కోరారు.

Pages