District News

ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతోనే జిల్లా బతుకు ఆధార పడి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనానంతరం కనీసం ఆరు నెలల్లోపు కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా దాని వూసే లేదని పేర్కొ న్నారు. జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉందన్నారు. అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష మందికిపరోక్షంగా ఉపాధి అవకాశం...

పోలవరం ప్రాజెక్ట్ కు  ఒక న్యాయం, గండికోట ప్రాజెక్ట్ కు మరొక న్యాయమా అని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్ట్  కూడా పోలవరం ప్రాజెక్ట్  మాదిరే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని , ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం చౌటపల్లె గ్రామస్థులు, గండికోటనిర్వాసితులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా ఆందోళన కొనసాగింది. ముంపునకఁ గురైన గ్రామాలకఁ చెందిన ప్రజలతో ధర్నా వద్ద మధు మట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ కింద ని ర్వాసితులకఁ రూ.10 లక్షలు పరిహారం ఇచ్చారని ,...

రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఏడాదిలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని...

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవ‌ని  సిపిఎం రాష్ట్రకార్య‌ద‌ర్శి వ‌ర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి  నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగుల‌ను...

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్ధుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ, స‌భ నిర్వ‌హించారు. క‌ళాక్షేత్రం వ‌ద్ద నుండి జ‌రిగిన ర్యాలీలో  వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు,  అభ్యుద‌య వాదులు, ప్ర‌జలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని నిర‌స‌న తెలియ‌చేశారు.   విద్యార్దుల‌పై పెట్టిన అ్ర‌క‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని, క‌న్హ‌య్ కుమార్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని,  యూనివ‌ర్సీటీల‌లో కేంద్ర‌ప్రభుత్వ జోక్యం ఉండ‌రాద‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.   అనంత‌రం లెనిన్  సెంట‌ర్‌లో జ‌రిగిన స‌భ‌లో వామ‌ప‌క్ష పార్టీల నాయ‌కులు మాట్లాడారు. బిజెపి  ప్ర‌భుత్వం  కావాల‌నే...

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా భవనం వద్దకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు...

 ఆంగన్‌వాడీ కార్యకర్తలను దూషించిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కడప పాతబస్టాండ్‌లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కోశాధికారి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌.సుబ్బమ్మ మాట్లాడుతూ ఏలూరులో చింతమనేనికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్‌వాడీల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. గతంలో తహశీల్దార్‌ వనజాక్షి పట్లా ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేశారు.

Pages