రైల్వే బడ్జెలో రాజధానికి రిక్తహస్తం

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవ‌ని  సిపిఎం రాష్ట్రకార్య‌ద‌ర్శి వ‌ర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి  నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగుల‌ను కుదించడానికి అవకాశం కల్పించింది. స్టేషన్లను ప్రైవేటీకరించడానికి పి.పి.పి. పద్దతిని ఈ బడ్జెట్‌ ఆమోదముద్ర వేసింది.  విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి ప్రత్యే రైల్వే జోన్‌ ఇస్తామని చెప్పి 20 నెలు గడిచినా బి.జె.పి. ప్రభుత్వం ఇవ్వంకుండా ప్రజల‌ను నమ్మక ద్రోహం చేసింది. భవిష్యత్‌లో పరోక్షంగా అనేక రకా భారాలు వేసే ప్రమాదం వుంది. మచిలీపట్నం పోర్టుకు అనుసందానం చేస్తూ లైన్లు ఏర్పాటుకు అన్యాయం జరిగింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కేంద్రప్రభుత్వం బిజెపి కాగా, రాష్ట్రాన్ని పాలిస్తున్న తొగుదేశం ప్రభుత్వానికి కూడా  ఇందులో భాగం వుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం వుండి కూడా రైల్వే అభివృద్దికి, స్టేషన్ల అభివృద్దికి, ప్రత్యేక జోన్‌కు నిధలు మంజూరు చేయించుకోలేని స్థితిలో టిడిపి మంత్రులున్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించాలి. రైల్వే బడ్జెట్‌ సవరణకు తొగుదేశం మంత్రులు పట్టుబట్టాలి. లేకపోతే మొత్తం మీద కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఈ బడ్జెట్‌ విషయంలో ప్రజల‌కు అన్యాంయ చేసినట్లే అవుతుంది.  సి.ఆర్‌.డి.ఏ ప్రాంతంలోని మెట్రోట్రైన్‌ ఏర్పాటు విషయంపై ఊడా పూర్తి స్పష్టత లేదు. మొత్తం మీద ఈ బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది.