District News
బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బిజెపిని వదిలేస్తే రాష్ట్రాన్ని మూసేస్తుంది
రాష్ట్రంలో వైసిపి, టిడిపి కళ్లు తెరవాలి
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించడంతోపాటు బలమైన రాజకీయ శక్తిగా సిపిఎంను తీర్చిదిద్దాలని రాష్ట్ర మాహాసభ నిర్ణయించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని నిలువరించకపోతే రాష్ట్రాన్ని కూడా మూసేస్తుందని మండిపడ్డారు. గురువారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, మంతెన సీతారాం, బి.తులసీదాస్,...
సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్ నేత బిఆర్ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.