తాడేపల్లిలో సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.