District News

        చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్‌ తుపాన్‌లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్‌ చైర్మన్‌ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్‌ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి పంచదార అమ్మకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు....

విశాఖ మన్యంలోని బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.  చంద్రబాబునాయుడు బాక్సైట్‌ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆటోమెటిక్‌గా రద్దయ్యే జిఒలను రద్దు చేసినట్లు చంద్రబాబు చెబుతూ గిరిజనులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు....

నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు భరించలేని విధంగా పన్నులు పెంచి, అపరాధ రుసుముతో కట్టాలని మున్సిపల్‌ అధికారులు బెదిరింపులకు దిగడం దుర్మార్గమని, తక్షణమే బెదిరింపులు ఆపాలని...

స్మార్ట్‌సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్‌సిటీ ఫీజు వసూలు  చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్‌ పేయర్స్‌కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్‌సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు  ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్‌ ఏరియా ప్రాంతమైన ఆర్‌.కె బీచ్‌ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు. ఈ నిర్ణయాలు అత్యంత వివక్షతతోను, బాధ్యతా రహితంగా ఉన్నాయి. స్మార్ట్‌సిటి...

    ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు  మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు  అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ జరుగుతుంది. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో విశాఖ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు  కె.ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐలూ నాయకులు ఎన్‌. హరినాధ్‌, ఎ.కె.ఎన్‌ మల్లేష్‌, ఐ.ఎ.ఎల్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్‌ లు  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.
    భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉన్నది. కాని ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరహక్కులను కాపాడటంలో...

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం మరోసారి గిరిజనులను మోసం చేస్తోందని, నిజంగా చిత్తశుద్ధి, గిరిజనుల మనోభావాల మీద గౌరవం వుంటే జర్రెల బ్లాక్‌లో 1212 హెక్టార్ల బాక్సైట్‌ తవ్వకాలకు ఎపిఎండిసికి లీజుకిస్తూ 2015 నవంబర్‌ 5న విడుదల...

           సబ్బవరం మండలం, వంగలి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ, రీసర్వే నిర్వహించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వంగలి గ్రామ రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. వారికి మద్దతు తెలియజేసిన లోకనాథం మాట్లాడుతూ వంగలి ప్రాంతంలో అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం కన్నుపడిందని, అర్బన్‌ అగ్లమిరేషన్‌ పేరుతో పట్టాలు ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరణ చేసి, రైతులను భూముల నుండి వెళ్ళగొట్టాడానికి రంగం సిద్ధం చేస్తున్నారని, తెలిపారు. మోసాల సర్వేతో భూములను లాక్కొవడం...

ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు  ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన క్రింద ఆన్‌లైన్‌ ద్వారా 1,84,424 మంది పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికి 80వేల మందికి సర్వే చేశారు. ఇందులో 64వేల మందికి ఆధార్‌, రేషన్‌ కార్డు సరిగ్గా లేవని చెప్పి తొలగించడం జరిగింది. అడ్రసు దొరకలేదని 40వేల వరకు తొలగించారు.  దీనీవల్ల అర్హులైనవారికి ఇళ్ళు వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. సర్వేచేసిన వాటిని  కంపూటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు. నిష్ఫక్షపాతంగా ఎంక్వయిరీ జరపాని కోరుచున్నాం. ధరఖాస్తు చేసుకున్న...

- హెచ్‌ గేట్‌లో దారి మూసివేతకు నిరసనగా కార్మికుల ధర్నా
- మద్దతుగా నిలిచిన సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, ఎం.అప్పలరాజు
- దిగొచ్చిన యాజమాన్యం 
        నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌ కంపెనీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ హెచ్‌ గేట్‌ వద్ద వాహనాలు రాకపోకలు సాగించే దారి మూసివేతను నిరసిస్తూ హెటిరో కార్మికులు విధులను బహిష్కరించి గేట్‌కు ఎదురుగా ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉన్న దారిలో యథావిధిగా కార్మికుల వాహనాలు రాకపోకలు సాగించేందుకు మార్గంలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం....

       
    ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్‌ తహసీల్ధార్‌ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్‌ గారికి  మెమోరాండం ఇవ్వడం జరిగింది.
    ఈ సందర్భంగా  సిపిఐ(ఎం) నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ జి.వో నెం 296 నిబంధనలను అధికారులు అతిక్రమిస్తున్నారని ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది ఉన్న కంప్యూటర్‌లో ఆఫ్‌లోడ్‌ చేయడం లేదని, ఆన్‌లైన్‌లో ధరఖాస్తు స్వీకరించడం లేదని, విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు  లేవు. ఫలితంగా పేదలు  తీవ్ర అభద్రతా...

Pages