District News

పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్‌లో ఇద్దరు, మైలాన్‌లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్‌ ఫార్మాలో బాయిలర్‌ లీకేజ్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్‌ఇజెడ్‌ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్‌ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టే వరకు అన్ని కంపెనీల్లో అందోళనలు చేయాలని...

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి గట్టించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి...

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం...

 చిత్తశుద్దితో రాజ్యాంగం అమలుతోనే సామజిక న్యాయం సాధ్యం అని ప్రముఖ రచయిత శ్రీ కంచే ఐలయ్య అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఉక్కునగరం లో కులవివక్షత వితిరేక పోరాట సంగం,ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం మరియు డి ఐ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సామజిక న్యాయం అనే అంశంపై జరిగిన జాతీయసదస్సు లో అన్నారు

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.
    ఈ సందర్భంగా గంగారావుగారు మాట్లాడుతూ రే లబ్ధిదారుకు...

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర
కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తొలుగుదేశం - బిజెపి కుమ్మక్కు
విమ్స్‌ నిర్వీర్యానికీ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగింత
    
    విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికెల్‌ సైన్స్‌ (విమ్స్‌) హాస్పటల్‌ అవుట్‌ పేషెంట్‌ (ఒ.పి) సేవలను ఏప్రిల్‌ 11న ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమ్స్‌లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఓపి సేవాలు  ప్రారంభించడం వెనుక తెలుగుదేశం, బిజెపిలు పెద్ద కుట్రకు పల్పపాడ్డాయి. ఈ చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖ నగర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
    విమ్స్‌ ఆధీనంలో 100 ఎకరాల స్థలం ఉంది. అందులో...

- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు 
- దివీస్‌ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్‌ 
            విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌లోని హెచ్‌ బ్లాక్‌లో బుధవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి, రా మెటీరియల్‌ లోడ్‌ చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గణపతి, భాస్కర్‌, అసిరినాయుడు అనే ముగ్గురు కార్మికులకు...

సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్‌ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు. 30 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతుల ఆమోదం లేకుండా భూ సేకరణ చేయడం సరికాదన్నారు....

   ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
        ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.         

              విశాఖ-చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ కోసం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి రైతుల నుంచి...

జూన్‌ 19న రాష్ట్రవ్యాప్త కార్మిక ఐక్య ర్యాలీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికులకు ఎటువంటి లబ్ధీ చేకూర్చలేదని, కార్మిక వ్యతిరేకతే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్‌ తెలిపారు. సోమవారం విశాఖలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వసూళ్ల మంత్రిగా, యాజమాన్యాల తొత్తుగా ఉన్నారే తప్ప, కార్మిక సమస్యలపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యూనియన్లు వద్దంటూనే...

Pages