District News

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం 'బాక్సైట్‌ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం' అంశంపై ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపర్చేందుకు గిరిజనులంతా ఏకోన్ముఖంగా కదలాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు అన్‌...

దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల‌ ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్ర‌మంత్రులైన బండారు, స్మృతి ఇరానీల‌ను కూడా  కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్‌ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతుల‌ను బహిష్కరించి  భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల‌ నుండి ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాల‌ని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. నేడు జరిగిన బంద్‌లో సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు, నగర, జిల్లా కార్యదర్శులు బి.గంగారావు, కె.లోకనాధం గార్లు కూడా పాల్గొని తమ మద్దతు తెలియజేసారు. ఇత‌ర వామ‌ప‌క్ష‌పార్టీలు,...

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మంగళవారం ఉదయం విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్లో పోలీసు బాధిత కుటుంబాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో మౌలికసదుపాయాల...

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల...

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నా కేంద్ర నుండి రావల్సిన నిధులను ఎందుకు...

హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్‌ ఏర్పాటుచేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశంపై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

                        ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం. 633 ను విడుదల చేసిందని, మెడాల్ సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు...

 గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలతో సహా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి సమస్యలతో పాటు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాంట్రాక్టర్లను సంతృప్తి పర్చేందుకు, గొప్పల కోసం అరకు ఉత్సవాలను నిర్వహించడం సరికాదని సిపిఎం తప్పుపట్టింది. ఉత్సవాల నిర్వహణపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న గిరిజన ప్రజలు, నాయకులను పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్చివేస్తూ అరెస్టు చేయ టాన్ని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తీవ్రంగా ఖండించారు..

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేయాలని, హుదూద్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు, గిరిజనులకు, కూలీలకు పరిహారం చెల్లించాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మ్యూజియం వద్ద నిరసన తెలుపుతుండగా తొమ్మిది మంది సిపిఎం, గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించిన...

ఈ రోజు సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్ పాల్గొన్నారు.....

  • 2000 సంవత్సరంలో టిఎసిలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం చేసినది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
  • 1997లో దుబాల్ కంపెనీతో ఒప్పందాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
  • కాంగ్రెస్ అధికారంలో వుండగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలని కోరినా ఎందుకు రద్దు చేయలేదు?
  • ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడంలేదు?
  • 2007-08లో రస్ఆల్-ఖైమాతో జరిగిన ఒప్పాంలు తప్పులతడకని కాగ్ నివేదికపై తెలుగుదేశం ప్రభుత్వం...

Pages