District News

                 భీమిలి మండలంలోని దివీస్‌ లేబొరేటరీస్‌ స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి బాధిత భూ సాగుదారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావులు గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వివరాలు....
దివీస్‌ లేబొరేటరీస్‌ భూ సమస్య, కాలుష్యం, ఇతర సమస్యలపై ఫిబ్రవరి 22న మీకు విన్నవించాం. నాలుగు పంచాయతీల్లోని 17 గ్రామాలకు చెందిన 16 వేల మంది ప్రజల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు....

కేంద్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన విద్యాహక్కు చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా విద్యా హక్కుచట్టానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. స్టూడెంట్‌, టీచర్‌ నిష్పత్తి ప్రకారం స్కూల్‌లను మూసివేస్తున్నారని, ఇప్పటికే 400 స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. అభివృద్ధి చెందాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తెరవాల్సినవసరం ఉందన్నారు. సర్వశిక్షా అభియాన్‌ కింద బడ్జెట్‌లో కేటాయింపులు కుదించిందనీ, ఈ మేరకు ఈ పథకం కింద బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు....

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు
తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎమ్‌డి ఛాంబర్‌ లోపలకు చొచ్చుకెళ్లి ఎమ్‌డి సత్యప్రసాద్‌ ఎదుట బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమితి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సమితి కన్వీనర్‌ ఎ.బాలకృష్ణ, కో-కన్వీనర్‌ ఫణిరాజ్‌, ఆప్...

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్‌ యాజమాన్యం చర్చలు ద్వారా డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సంధానకర్తలు,...

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను కాలుష్యంతో నింపడమేనా చంద్రబాబు అభివృద్ధి అని ప్రశ్నించారు. వాతావరణానికి హాని లేని, ఉపాధికి కొదువ లేని...

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 
    సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతుందని...

విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎం.ఎల్‌.సి శ్రీ ఎం.వి.ఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. విమ్స్‌ను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేస్తున్న 48 గంటల నిరాహారదీక్షా శిభిరాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, సామాన్య ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌కు 100 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు 600రోజులు పూర్తవుతున్నా...

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

Pages