District News

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. నక్కపల్లి ఇండిస్టియల్‌ పార్కు పేరుతో భూసేకరణకు 2010లో నోటిఫికేషన్‌ ఇవ్వగా, దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 2011లో...

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్వతంత్ర ఇంజినీరింగ్‌ నిపుణుల  బృందంచే  విచారణ జరిపించి, బృందం దృష్టికొచ్చిన పలు  విషయాలపై విచారణ జరిపి వాస్తవాలు  వెల్లడిరచాలని  నగర కార్యదర్శి బి గంగరావు డిమాండ్‌ చేశారు.
    విశాఖనగరంలో హదూద్‌ తుపాను...

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.
    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగరకార్యదర్శి బి. గంగారావు ప్రసంగిచారు. మొన్నటిదాక అదిగోవస్తుంది, యిదిగో వస్తుందని ప్రకటను గుప్పించిన ఎంపి హరిబాబు చావుకబురు చల్లగా చేప్పినట్లు విశాఖకు రైల్వేజోన్‌ రాదని పరోక్షంగా వ్లెడిచారు. రైల్వేజోన్‌ పై వేసిన కమిటి విశాఖకు వ్యతిరేకంగా...

జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి పనుల్లో పాల్గొంటున్న కూలీలకు పనిముట్లు, టెంట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు...

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.
    ఎంఎల్‌ఏల   ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాలు విశాఖనగర ప్రజలకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వవలు  ప్రజల  ఎడల  ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని...

రాష్ట్రంలో పిసిపిఐఆర్‌ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.క్రాంతి డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమానికి భూ సేకరణ బాధితులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల భూమిని బడా కంపెనీలకు, పెట్టుబడుదారులకు దారాదత్తంచేసేందుకు పూనుకుంటోందన్నారు. నక్కపల్లి మండలంలో పిసిపిఐఆర్‌ పేరుతో చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రైతాంగం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టులో స్టే వుండగా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు రైతులు వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు. రైతులు, వృత్తిదారులు, పేదలు...

            అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, గాంధీనగర్‌, కార్మికనగర్‌, జ్యోతినగర్‌, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్‌ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 
సిసిఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్‌ మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో...

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి కొరతకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. పుష్కర లింకు, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం విశాఖ నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంచినీటి సరఫరా సమయం తగ్గించారని, కొండ ప్రాంతాలకు నీరు ఎక్కడం లేదని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,...

       విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు, ప్రజలు గురువారం ఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీనికిముందు ద్వారకానగర్‌ కూడలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తూ వినియోగదారులపై ఛార్జీల మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతంలోని బిఎన్‌ఆర్‌ నగర్‌లో 400 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేదన్నారు. చాలాసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా చేయాలని...

Pages