District News

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌-సేవ్‌ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల  ఆరోగ్యాలను రక్షించాలని, పి.హెచ్.సిలలో రోగులకు భోజనం పెట్టాలని, సిపియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శులు లోకనాధం, గంగరావు  విశాఖ పూర్ణమార్కెట్ వద్ద క్యాంపెయిన్ చేసి వ్యాపారుల వద్ద నుండి  బియ్యం, పప్పులు వగైరా సేకరించారు.

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు 

విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎఎన్‌-32 ప్రమాద దుర్ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తొలుత బుచ్చిరాజుపాలెంకు చెందిన నమ్మి చిన్నారావు, లక్ష్మీనగర్‌కు చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. అనంతరం అక్కడ నుంచి వేపగుంటలోని గంట్ల శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలోని సాంబమూర్తి ఇళ్లకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి మనోధైర్యం కలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఐదు రోజులైందని, గాలింపు చర్యలను నేవీ బృందాలు ముమ్మరం చేశాయని తెలిపారు. విమాన అదృశ్య ప్రమాదంలో 29 మంది...

             జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని, సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ జికె.వీధి మండలానికి చెందిన దారకొండ, ఎ.దారకొండ, గాలికొండ, పెదవలస, దేవరాపల్లి, వంచుల, జర్రెల పంచాయతీల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసినా గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. వర్షాల...

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

               విశాఖలో మంచినీటి వ్యాపారం కోసం రైతుల పొట్టగొట్టి రైవాడ నుంచి అదనంగా 150 క్యూసెక్కుల నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో రైతులతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైవాడ నుంచి విశాఖకు అదనంగా నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైవాడ నీటిని రైతులకే పూర్తిగా అందిస్తామని, రిజర్వాయర్‌ను రైతులకు అంకితం చేస్తామని అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అదనంగా నీటిని తరలించుకుపోవడానికి నిర్ణచయించడం దారుణమన్నారు. ఒక పక్క అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రైవాడ...

               ఓలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన 9 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఫ్యాక్టరీ కార్మికులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నర్సీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజు మాట్లాడుతూ నర్సీపట్నం మండలం అమలాపురంలోని ఓలం జీడిపిక్కల కర్మాగారంలో 13 సంవత్సరాల నుండి మహిళలు, అనేక మంది కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 9 మందిని మార్చి 20వ తేదీ నుండి ఫ్యాక్టరీలో పని చేయడానికి ప్రవేశం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఆటంకపర్చారని చెప్పారు. ఎటువంటి కారణం లేకుండా ఈ 9 మంది కార్మికులను తొలగించారని, దీనిపై ప్రశ్నిస్తే వయస్సు మీరిందని, అందువల్ల...

Pages