District News

ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్‌ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.

                చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా తన హాయంలో విడుదల చేసిన జి.వో.నెం.97ను, అన్‌రాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను...

హుదూద్‌ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వామపక్షాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గిరిజన గర్జనలో భాగంగా  నర్సీపట్నంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందకారత్  బాక్సైట్ తవ్వకాలపై  ప్రెస్మీట్ నిర్వహించారు.బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని  విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి...

           విశాఖ జిల్లా జర్రెల బాక్సైట్‌ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి అవాస్తవాలతో వున్నది. జర్రెల బాక్సైట్‌ గనుల్లో అపార నిల్వలు వున్నాయని, ఈ నిల్వలను వెలికితీసి రాష్ట్రానికి ఆదాయం పెంచవచ్చని ప్రభుత్వ ప్రధాన వాదన. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97కు ముందే కాంగ్రెస్‌ మరియు వైఎస్‌ఆర్‌ పార్టీలు బాక్సైట్‌ తవ్వకాల పర్యావరణ అనుమతుల జి.వో జారీచేశాయని, రస్‌ ఆల్‌ఖైమాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో వాదన.  బాక్సైట్‌ అత్యధికంగా వున్న ఒరిస్సాలో తవ్వకాలు జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తవ్వకాలు ఎందుకు జరపకూడదనేది మూడవ వాదన. 19 పేజీల శ్వేతపత్రంలో అత్యధికం మరకలే...

విశాఖ: బాక్సైట్‌ తవ్వకాలను ఐక్యంగా అడ్డుకోవాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. గిరిజన భవన్‌ బాక్సైట్‌ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, గిరిజన చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతర సంస్థ మాత్రమేనని, అటువంటి గిరిజనేతర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గ్రామ సభ లు చేసిన తీర్మానాలే సుప్రీం అని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కంటే గ్రామ సభలకే అధికారం అధికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.

 

 

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

 

   ప్రభుత్వం నాటకాలాడుతోందని, బాక్సైట్‌ జివోను తాత్కాలికంగా రద్దు చేసినట్లు మాట్లాడినా వాటి ప్రమాదం, బాక్సైట్‌ ఒప్పందాల ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం గిరిజనాన్ని హెచ్చరించారు. అందుకే ఆ బాక్సైట్‌ ఒప్పందంపైనే ప్రధానంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజనోద్యోగుల భవనంలో ఆ పార్టీ ఏజెన్సీ 11 మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లో 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. సప్పర్ల, జెర్రెల, జికెవీధి, గాలికొండ కొండల్లో తవ్వకాలు చేపడితే పరిసర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు...

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

Pages