District News

రైతులకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడకపోతే దేశ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం'పై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రాంగణం మొత్తం రైతుల కిక్కిరిసిపోయింది. వందలాది మంది నిల్చునే వక్తల ప్రసంగాలను విన్నారు. అదనపు కుర్చీలనూ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ విధానాలపై విధాన పత్రాన్ని విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముద్రించిన 'మహారాష్ట్రలో రైతుల మహాపాదయాత్ర...

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు. నోట్ల రద్దు వల్ల 80 లక్షల మందికిపైగా ఉపాధి కోల్పోయారని, జిఎస్‌టి వల్ల ధరలు పెరిగాయి తప్ప తగ్గలేదని విమర్శించారు. పెట్టుబడులు...

ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని, పంటలకు గిట్టుబాటు ధరల్లేక నాలుగేళ్లలో రెండు లక్షల మంది రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు తమ...

రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతా సెప్టెంబర్‌ 10, 11న గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని, జాతాను విజయవంతం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతా వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సమాగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను ప్రచారం చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15న విజయవాడలో మహాగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో వివిధ రంగాలపై సదస్సులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు విశాఖపట్టణం, అనంతపురం నుండి రెండు బస్సు...

వ‌ర‌ద‌ల వల్ల‌, క‌రువు ప్రాంతాల‌లో న‌ష్ట‌పోయిన వాస్త‌వ సాగుదారులు, కౌలు రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని సిపిఎం కేంద్ర‌క‌మిటి స‌భ్యులు వి. శ్రీ‌నివాస‌రావు అన్నారు. గుంటూరులో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో క‌రువుల వ‌ల‌న, వర్షాల వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌లు వ‌ల్ల రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. క‌రువు, వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోక‌పోతే వ్య‌వ‌సాయం గ‌ట్టెక్క‌దు. ముఖ్య‌మంత్రి వ‌ర‌ద‌ల ప్రాంతాల‌లో సంద‌ర్శించి రైతుల‌కు ఎక‌రానికి 10వేల రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయం అభివృద్ది చెంద‌డం క‌ష్టం అన్నారు. వాస్త‌వ సాగుదారుల‌కు...

మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర కార్మిక, రైతాంగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కర్నూల్లో జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా కార్మిక కర్షకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా పోలీసులు కార్మిక, రైతాంగ సంఘాల నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పండించిన పంటలకు 50 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలన్నీ ఎండిపోయాయని, పశ్చిమ ప్రాంతంలో పూర్తిగా...

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను దక్కించుకున్న ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కి కాకుండా ప్రైవేట్ సంస్థ అయిన జి.ఎం.ఆర్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ నగరంలో వున్న తాజ్ హోటల్ (గేట్ వే) లో భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్రీ అప్లికేషన్ కాన్పెరెన్స్ ను రద్దు చేయాలని, నిర్మాణ పనులు ఎఎఐ కి అప్పగించాలని ఆందోళన చేస్తున్న సిపిఎం కార్యకర్తలను, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. 

విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగడతామని చెప్పారు.  

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాని మార్పు చేసి రైతుల నుండి బలవంతంగా భూమి గుంజుకుంటుందని అన్నారు. భూసేకరణ చట్టంలో రైతుల నుండి భూమి తీసుకున్న తర్వాత 5సంవత్సరలోపు ఎటువంటి పనులు ఆభూములలో చేయకపోతే తిరిగిరైతుకు భూమి ఇవ్వాలని ఉందని కానీ చంద్రబాబు భూసేకరణ చట్టసవరణ ద్వారా ఆ విషయాన్ని చట్టం నుండి తొలగించారని అన్నారు.. రైతులకు అండగా సిపిఎం ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

సమాన విద్య-ఉపాధి గ్యారంటీ కోసం రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సమాన విద్య-ఉపాధి గ్యారెంటీ కోసం వామపక్ష పార్టీల రాజకీయ ప్రత్యామ్నాయంపై తిరుపతి యశోధనగర్‌లోని ఎంబి భవన్‌లోకోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. దీనికి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నంపెంచులయ్య అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ దివాళాకోరుతనానికి బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో ప్రయివేటీకరణ, మతోన్మాద విధానాలు చొప్పించే...

Pages