District News

ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడం వంటివి సోషలిజంతోనే సాధ్యమని అక్టోబర్‌ విప్లవ దినోత్సవ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్‌ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పెట్టబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని చూపించి, కార్మికవర్గం పరిపాలన చేయవచ్చని సోవియెట్‌ యూనియన్‌ ప్రపంచానికి నిరూపించిందని గుర్తుచేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలనను అధికారంలోకి తీసుకురావడంలో ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని, త్యాగాలకు దూరంగా ఉండి, బ్రిటీషు వారికి ఊడిగం చేసిన ఆరెస్సెస్‌కు...

ఇసుక కొరత వల్ల పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సిపిఎం అండగా ఉంటుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారి కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.10వేలు పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే తదుపరి...

బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖ నగరం మద్దిలపాలెం కూడలిలో రాస్తా రోకో నిర్వహిస్తున్న cpi,cpm పార్టీలు.

Pages