District News

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కబేళా, సింగ్‌నగర్‌లో, జక్కంపూడి వైఎస్‌ఆర్‌కాలనీలో మధ్యలో...

ఏ.కొండూరు కిడ్నీ బాధితులందరికి ఆర్థికసహయం, ఆయా కార్పొరేషన్ల నుండి ఋణాలు, తిరువూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, అన్ని గ్రామాలకు పైపులైన్ ద్వారా కృష్ణ జలాల సరఫరా, పెన్షన్లు, డయాలసిస్ చేయించుకునే వారికి అంబులెన్స్, ఉచితంగా మందుల సరఫరా, చనిపోయిన కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రెసియా వెంటనే ఇవ్వాలి.భావితరాలకు కిడ్నీ సమస్య రాకుండా చౌక డిపోల ద్వారా పౌష్టికాహారం అందించాలి వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ch. బాబురావు గారు,సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి d.v కృష్ణ గారు,జిల్లా కమిటీ సభ్యులు g. విజయప్రకాశ్ గారు అధికారులకు వినతిపత్రం అందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.  బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామంలో దళిత వాడలో కనీస సౌకర్యాలు లేవని, వారు తీవ్ర వివక్షతకు...

గోట్టిపాడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన  పర్యటనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి  పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణయ్య ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.దళితులపై దాడుల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని మధు విమర్శించారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన కులోన్మాదుల్ని 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని, దళితులపై మోపిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, దళితులకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి, ఆ పంచాయతీకి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌...

అమరజీవి కామ్రేడ్‌ మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపు నిచ్చారు.
నేడు 2/7 బ్రాడీపేట సిపియం కార్యాయంలో బసవపున్నయ్య 103వ జయంతి సందర్భంగా నగర కార్యదర్శి కె.నళినికాంత్‌ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులు కె.రామిరెడ్డి బసవపున్నయ్య చిత్రపటానికి పూమాల‌వేసి నివాళుర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కామ్రేడ్‌ బసవపున్నయ్య తన జీవితాంతం కష్టజీవు సమస్యల‌ పరిష్కారానికి కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అతివాద, మితవాద విచ్ఛిన్నకర ఉధ్యమాల‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సిపియం పార్టీ ఏర్పడిన...

భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. బందరు నోబుల్‌ కళాశాలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు. ఆనాడు కాంగ్రెస్‌ నాయకత్వం ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్దు చేయటంతో అసంతృప్తి చెందిన కామ్రేడ్‌ బసవపున్నయ్య భారతదేశ ప్రజ సమస్యు సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే పరిష్కారం కాగవన్న ధృడమైన విశ్వాసంతో 1934`35లో కమ్యూనిస్టు...

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.  విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన...

మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకమైన శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతాన్ని అక్టోబరు విప్లవం నిరూపించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. రష్యన్ విప్లవం శత వార్షిక ఉత్సవాలను పురష్కరించుకుని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దరాజు రామం భవనంలో జరిగిన అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సీతారాం మట్లాడుతూ కార్మికవర్గం తొలి రాజ్యాధికారం అక్టోబర్ విప్లవం ద్వారా సాధ్యమైందన్నారు. అక్టోబర్ విప్లవ ఫలితంగా ఆవిర్భవించిన సోవియెట్ యూనియన్ హిట్లర్ ఫాసిజాన్ని మట్టికరిపించిదని, ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సోవియెట్ యూనియన్ 4 కోట్ల మంది సైన్యం , పౌరులను త్యాగం...

Pages