District News

ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ ప్రత్యా మ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన మహాగర్జన కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున జరుగుతోంది.  బిఆర్‌టిఎస్‌ రోడ్డులో మధురానగర్‌ వద్ద ఇప్పటికే సభావేదికను సిద్ధం చేశారు. పలు జిల్లాల నుండి కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు. అనంతపురం, చిత్తూరు నుండి రెండు ప్రత్యేక రైళ్లు బయలు దేరాయి. మహాగర్జన బహిరంగసభలో పాల్గొ నేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ నగరానికి చేరుకున్నారు.సభకు ముందు నగరంలో రెండు మహా ప్రదర్శనలు జరగనున్నాయి. రైల్వేస్టేషన్‌ నుండి సాంబమూర్తిరోడ్డు మీదుగా ఒక ప్రదర్శన, గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రి నుండి మరోప్రదర్శన ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని...

భారత్‌బంద్‌లో భాగంగా విజయవాడలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. పెట్రోల్‌ బంక్‌లు మూతపడగా, దుకాణాలు మూసే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. బంద్‌ వాతావరణం స్పష్టంగా కనిపించింది. 

విజయవాడలో సెప్టెంబర్‌ 15న నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో బస్సు యాత్ర చేపట్టారు. ముందుగా బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూ‌రో స‌భ్యు‌లు బి.రాఘవులు మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి విధానాలు రాష్ట్రంలో ఒకే విధంగా ఉన్నాయన్నారు. టిడిపి, వైసిపిలు ఇంతవరకూ చాలా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాయి కాని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోయాయని, ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోయాయని దుయ్యబట్టారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్‌ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామన్న...

ఆగస్టు 28,2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్ లో ఆందోళనచేస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా జరిగిన కాల్పులలో మరణించిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి , బాలస్వాములకు సిపిఎం రాష్ట్ర కమిటీ నివాళి అర్పించింది. ప్రపంచబ్యాంక్ విధానాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రజలపై, కార్మికులపై భారాలను మోపుతున్నాడు..ఈ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల త్యాగాల స్పూర్తితో ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర కమిటీ తెలియజేసింది. అమరవీరుల చిత్ర పటాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, మంతెనసీతారం, సిహెచ్ బాబురావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..

రేపల్లె పట్టణంలో ప్రజా సమస్యలపై.. "సీపీఎం వార్డులలో పాదయాత్ర" పేదలు నివాసాలు ఉంటున్న ఏరియాలో పేదలు వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవటం జరుగుతుందిని సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సి.హెచ్.మణిలాల్ తెలిపారు.ఇ ప్రజా సమస్యల పాదయాత్ర గురించి మణిలాల్ మాట్లాడుతు ఉదయం 21 వార్డులోని తేజ కాలనీ నుండి ప్రారంబిచి పలు వార్డులులో ప్రధానంగా పేదలు సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగింది.ఇళ్ళస్థలాలు అర్హులు లిస్టులో ఇప్పుడు అపార్టుమెంట్స్ నిర్మిస్తున్న 1344 మందిలో నిజంగా పేదలుగా ఉన్న మా పేర్లు లేవు అని 19 వార్డులో సోసైటీ భూములో 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలు వాపోయారు,అలానే 21,20 వార్డులో అద్దెలకు ఉంటున్న ముస్లిము కుటంబాలు పేర్లు...

Pages