District News

కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్‌ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్‌ ఆల్‌లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రకటనలు వీడియో మీడియా...

 ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. సమాజం ఎదుర్కొనే ఏ సంక్షోభమైనా-అది ఆర్థికమైనా లేక సామాజికమైనా-ప్రభుత్వ విధానాల ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఫైనాన్స్‌ పెట్టుబడి- కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులు, కోటీశ్వరుల-ప్రయోజనాలను పరిరక్షించేదిగానే వుంటుందే తప్ప కార్మికుల...

'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం. ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ...

దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. విచారించవల్సిన విషయమేమంటే మన పాలకులు గానీ, అధికారులు గానీ, మీడియా గానీ ఎవరూ సూక్ష్మక్రిమి అన్వేషకులను...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి!! చైనా, ఇటలీ తరువాత మూడో స్థానంలోకి చేరిన అమెరికా!!! 228 ఏళ్ల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పథకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ఫెడరల్‌ రిజర్వు (రిజర్వు బ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియా లోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న. ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా 'వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పదిహేను రోజుల తరువాత ఏ మార్గంలో...

కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర విన్యాసమెరుగక బరిలోకి దూకిన సైనికుడిని తలపిస్తోంది. లాక్‌డౌన్‌ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన కష్టజీవులను ఆదుకోవడం మొదలుకొని కరోనా పోరులో కీలకమైన వైద్య సిబ్బందికి అండగా నిలవడం వరకూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్‌పై పోరు సల్పుతూ ప్రజల దృష్టిలో దేవుళ్లుగా మారిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదు. వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బందికి కనీస రక్షణ కిట్లను కూడా సరిపడ అందించకపోవడం ఆందోళనకరం. సోదర రాష్ట్రమైన తెలంగాణలో వీరి సేవలను ప్రశంసిస్తూ పూర్తి వేతనాన్ని ఇవ్వడంతో పాటు, అదనపు పారితోషికం ఇచ్చి...

Pages