District News

అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే కరోనా వైరస్‌ నేడు విశ్వ మానవాళికి పెను సవాలు విసురుతూ అతి పెద్ద శత్రువుగా పరిణమించింది. అణ్వాయుధ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అణగారిన దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తూ హడలెత్తిస్తున్న ఈ మహమ్మారిపై చైనాలోని వుహాన్‌ నగరం విజయం సాధించింది. ఇది ఈ వైరస్‌పై మానవాళి సాగిస్తున్న పోరాటంలో దక్కిన తొలి విజయం. ప్రజలు, ప్రజా సంక్షేమం కోరే పాలకులు ఉమ్మడిగా పట్టుబడితే ఎంతటి భయంకరమైన శత్రువైనా పాదాక్రాంతం కాకతప్పదనేందుకు వుహాన్‌ తార్కాణంగా నిలుస్తోంది. కరోనా మొట్టమొదట వెలుగుచూసిన హ్యుబెయి ప్రావిన్స్‌ లోని వుహాన్‌లో 76 రోజుల లాక్‌డౌన్‌కు బుధవారం తెర దించడం అక్కడి ప్రజలకే గాక విశ్వజనులందరికీ అమితానాందం...

లాక్ డౌన్ నేపధ్యంలో విజయవాడ సింగ్ నగర్ 59, 60 వ డివిజన్ లలో సిపిఎం నాయకులు ఇంటింటికీ కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల కొరతతో పాటు, ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్ , పప్పు ధాన్యాలు రేట్లు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో విఫలమైందన్నారు. దీపం పథకం కింద ఉన్న వారికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పనుల్లేని కార్మికులకు esi నుండి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్మికులకు కేటాయించిన 1000 కోట్ల నిధులని...

లాక్‌డౌన్‌ కారణంగా కేరళ రాష్ట్రానికి ఏమేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మీ అంచనా!

మాకు సాధారణ పరిస్థితులలో ఉండే ఆదాయాలలో కన్నా 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా జిఎస్‌టి వలన వచ్చే ఆదాయం సహజం గానే రాదు. మేం లాటరీలు నిలిపివేశాం. కేరళలో మందు దుకాణాలు మూసివేశాం. మోటార్‌ వాహనాల అమ్మకాలు లేవు. భూ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసినా రాబోయే మూడు నెలలలో ఇదివరకటి ఆదాయంలో సగానికి సగం తగ్గుదల ఉంటుంది. మొదటిగా లాక్‌డౌన్‌ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే యథాస్థితి రాదు. మూసివేసిన చిన్న పరిశ్రమల పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. పర్యాటకం లాంటివి...

కరోనా వైరస్‌ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్‌ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్‌ లూ, కలవకుండా ఉండడాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహా విపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది....

కరోనా వైరస్‌ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్‌ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న అనేక మంది స్పెషలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం 58 ప్రైవేటు ఆసుపత్రులలో...

 దేశంలో ఈ లాక్‌డౌన్‌ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం. ఎర్రజెండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే చిహ్నంగానే ఉంటుంది.ఈ కాలంలో ప్రతికూలమైన విషయం ఏమంటే... దేశ ప్రజల మాదిరిగా, మన కేంద్ర...

కరోనా సోకిన రోగి డాక్టర్‌ మీద వాంతి చేసుకుంటే ఏం చెయ్యాలి? క్వారంటైన్‌ లో వాంతి చేసుకుంటే ఏం చేయాలి? ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో వైరస్‌ నిండిన రక్తం చిందితే ఏం చేయాలి? ఆస్పత్రిలో వైరస్‌ సోకిన ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి మధ్య తేడాను ఎలా పాటించాలి? ఎటువంటి అనుమానితులను వైద్య పరీక్షలకు ఎంపిక చేసుకోవాలి? కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన వారిని ఎలా అప్పగించాలి?గత మూడు నెలలుగా ముందు వరుసలో నిలబడి పని చేసిన డాక్టర్లు, నర్సుల అనుభవాలను క్రోడీకరించి...ప్రపంచ దేశాలకు ఉపయోపడే విధంగా చైనా ఒక నివేదిక విడుదల చేసింది. పై ప్రశ్నలకు సమాధానం అందులో లభిస్తుంది. నివేదిక లోని పలు అంశాలను 'బిజినెస్‌ స్టాండర్డ్‌' దినపత్రిక ధారావాహికగా ప్రచురించే ప్రయత్నంలో...

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించేందుకు బిసిసిఐ (బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) సన్నాహాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్‌ 2020 మ్యాచ్‌లు దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్‌ 14 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? సడలించాలా? కొనసాగించాలా? అన్న విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాలు మరికొద్ది రోజులు కొనసాగించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ చర్చ సాగుతుండగానే 'ఆలూ...

Pages