2017

కార్పొరేట్‌ విధానంతో రైతులే కూలీలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులను కూలీలుగా మారుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసదస్సులో పాల్గొనేందుకు బుధవారం నరసరావుపేట వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల పట్ల సిపిఎం జేజేలు పలుకుతుందన్నారు. వేముల రోహిత్‌ ఎస్‌సిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన గుంటూరు కలెక్టర్‌ నేడు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల బీసీనా, ఎస్‌సినా అనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. నిలకడ లేని నష్టదాయక విధానాలు చాలా ప్రమాదకరమని తెలిపారు.

పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి

ఉండవల్లి హరిజనవాడకెళ్లే దారిలో ప్రభుత్వ భూమికి సంబంధించిన స్థలంలో ఇళ్లు వేసుకుంటామని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు స్థలాల్లోకి శనివారం చేరుకున్నారు. పుష్కరాల సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ళస్థలాలిస్తామని హామీనిచ్చి మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం పేదల ఇళ్లు తొలగించారు. నెలలు గడుస్తున్నా పేదలకు స్థలాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇందుకు ఉండవల్లి హరిజనవాడకెళ్ళే దారిలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మున్స్పిల కార్యాలయ ముట్టడి చేపసినా ఫలితం లేకుండా పోయింది.

సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణానికి సేకరించిన భూముల్లో పరిశ్రమలు వెంటనే స్థాపించాలి : సిపిఎం

పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూములలో వెంటనే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం స్థానిక కన్నెగంటి హనుమంతు భవన్‌లో సిపిఎం నాయకులు లేళ్ల లక్ష్మిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ 12సంవత్సరాల క్రితం సిమెంట్‌ఫ్యాక్టరీల కోసం వివిధ ప్రైవేటు సంస్థలు 12వేల ఎకరాలు భూములను పల్నాడు ప్రాంతంలో సేకరించారని ఇప్పటి వరకూ ఒక్కఫ్యాక్టరీ కూడా నిర్మించలేదన్నారు.

లాభాలు పెద్దలకు-రోగాలు ప్రజలకు..

చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి.

ఉపాధి పనుల కల్పనలో ప్రభుత్వం విఫలం

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

Pages

Subscribe to RSS - 2017