2017

కార్మికుల ఇళ్ల తొలగింపు దుర్మార్గం:CPM

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

దేవరపల్లిలో దళితులకు న్యాయం చేయాలి..

 ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులను నిర్బంధించి వారి భూములను సాగు చేసుకుంటున్నారనే విషయం తెలుసుకుని వారికి మద్దతుగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నాయకులు వై.వెంకటేశ్వరరావులను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి.అధికార యంత్రాంగం పెత్తందారులకు మద్దతుగా పోలీసులను పంపించి వారి పహారాలో దళితుల భూముల్లో చెరువులు తవ్వుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, దేవరపల్లి దళితులు సాగులో ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ సిపిఎం, వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన 'చలో భీమవరం' కార్యక్రమాన్ని పోలీసులు ఉద్రిక్తంగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సహా 151 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాలుగురోజుల కిందటే 'చలో భీమవరం' కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నోరు విప్పని పోలీసులు చివరి నిమిషంలో సభకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు యత్నించారు. మంగళవారం సాయంత్రం నుంచే భీమవరం, గరగపర్రులో భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు.

Pages

Subscribe to RSS - 2017