2017

గౌరీ లంకేష్‌ హత్యకు వ్యతిరేకంగా నిరసన

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

పెద సుబ్బారావుకు ఘన నివాళులు

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు.

11న సీతారాం ఏచూరి గుంటూరు రాక

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కేంద్రంగా సుందరయ్యభవన్‌

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి గాడిదమళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ - సేవ్‌ విశాఖ

ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌-సేవ్‌ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

Pages

Subscribe to RSS - 2017