2021

బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం

బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బిజెపిని వదిలేస్తే రాష్ట్రాన్ని మూసేస్తుంది
రాష్ట్రంలో వైసిపి, టిడిపి కళ్లు తెరవాలి

తాడేపల్లిలో సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు.

Pages

Subscribe to RSS - 2021