District News

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు...

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారని, కలిసొచ్చేవారిని కూడగట్టుకుని...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ట్యాపింగ్ తప్పు అని చెప్పిన చంద్రబాబు ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు సీఎంలా కాదు.. సెటిల్‌మెంట్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు యత్నిస్తున్నాడన్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. 

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు. రాజస్థా న్‌లో బిజెపి ప్రభుత్వం కీలకమైన పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్టు లేబర్‌ చట్టం, కనీస వేతనాల చట్టంను సవరించి కార్మికుల హక్కుల ను కాలరాసిందన్నారు...

Pages