District News

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు. రాజస్థా న్‌లో బిజెపి ప్రభుత్వం కీలకమైన పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్టు లేబర్‌ చట్టం, కనీస వేతనాల చట్టంను సవరించి కార్మికుల హక్కుల ను కాలరాసిందన్నారు...

Pages