District News
కర్నూల్ జిల్లా ఇందిరాగాంధీ నగర్ లో ఇంటింటికి కూరగాయలు ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, పి.యస్.రాధాకృష్ణ, నగర కార్యదర్శి టి.రాముడు మరియూ నాయకులు
తాజా పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ అమలు చేశారు. గవర్నర్ ఆమోదం పొందిన తరువాత కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్ నియామకం కూడా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా? ఏదైనా ఒకటే. కమిషనర్ పదవీ కాలం తగ్గింపు, ఆ వెంటనే తొలగింపు చట్టబద్ధమా, విరుద్ధమా అన్న చర్చ...
నిన్నటికి నిన్న...హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు పంపకపోతే ట్రంపు ప్రతీకారం తీర్చుకుంటా మనగానే...మోడీ ప్రభుత్వం భయపడిపోయింది. మారు మాట్లాడకుండా అమెరికాకు మందులు పంపించింది. ఈ రోజు...చైనా నుండి తమిళనాడుకు రావాల్సిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను బలవంతంగా మళ్లించేసుకున్నా నోరు మెదపలేదు. గతంలో కూడా ఇరాన్ నుండి ఆయిల్‌ను కొనవద్దని ఆజ్ఞ జారీ చేయగానే కొనడం ఆపివేసింది. సర్వసత్తాక సార్వభౌమాధికారం గల భారత దేశాన్ని మోడీ ప్రభుత్వం అప్రతిష్ట పాల్జేసింది. లాక్‌డౌన్ ప్రకటించడం తప్ప మోడీ ప్రభుత్వం కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్లను ఏర్పాటు చేయలేదు. వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ), రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు...
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాల్గవసారి దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగాడంబరం తప్ప ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల మెరుగుదలకు సంబంధించిన ఊసే లేదు. మూడు వారాల లాక్‌డౌన్ గడువు ముగియడంతో, దానిని మరో పందొమ్మిది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సరే. మరి ఈ లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది దినసరి వేతన కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనివారల మాటేమిటి? మోడీ ప్రసంగంలో వీరికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదు. వీరిని ఆదుకునేందుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదు. ఇంతకుముందు ప్రకటించిన 1.7 లక్షల...