2017

వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌..

బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.  బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.

గొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి..

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు.

Pages

Subscribe to RSS - 2017