2017

అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ

విజయనగరం జిల్లా సాలూరు లోని గిరిజన ప్రాంతాలలో శిఖపరువు,తామరకొండ, పోలిమెట్ట,దుక్కడమెట్టల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తామరకోండ,పోలిమెట్ట,దుక్కడమెట్ట శిఖపరువు కొండలను త్రవ్వకాలు చేయవదంటూ సిపిఎం నాయకత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలోని  పనులు అడ్డుకోవడం కోసం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ కృష్ణమూర్తి ప్రజలతో  కలిసి ర్యాలీగా బయలుదేరారు.. 

ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప జిల్లా బంద్

ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతోనే జిల్లా బతుకు ఆధార పడి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనానంతరం కనీసం ఆరు నెలల్లోపు కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా దాని వూసే లేదని పేర్కొ న్నారు. జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉందన్నారు.

జులై 14న రాష్ట్రస్థాయి దళిత సదస్సు

దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్‌, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు.

సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది.

Pages

Subscribe to RSS - 2017