పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. భూ పోరాటంలో అరెస్టయిన సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, నాయకులు అప్పలరాజు విడుదలైన సందర్భంగా సుజాతనగర్‌లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ల్యాండ్ పూలింగ్‌ను తమతో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఎక్కడో పద్మనాభపురం, ముదపాక శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిస్తే ఏలా ఉంటారని ప్రశ్నించారు. నివాసమున్నచోటే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ఏ...
పార్టీ కార్యక్రమాలు
దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఎన్‌ఆర్‌సి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రసంగిస్తూ.. ఎన్‌ఆర్‌సి అనే ప్రధానమైన సవాలును మన దేశం ఎదుర్కొంటోందన్నారు. 73 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం భారత రాజ్యాంగంలో మౌలికమైన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసేలా బిజెపి వ్యవహరిస్తోందన్నారు. విశాలమైన భారతదేశంలో వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ మతాలు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయని తెలిపారు. బ్రిటీష్ వారు వెళిపోతూ.. భారతదేశం నుండి పాకిస్తాన్‌ను విడదీసి మత వైషమ్యానికి కారకులయ్యారని, దేశంలో లౌకికతత్వాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు వామపక్షాలు...
ఉల్లి ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా ప్రతి కుటుంబానికి 5కిలోల ఉల్లిపాయలు సప్లే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని రైతుబజార్ లో పర్యటించి కొనుగోలుదారుల భాదలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాద్, శ్రీదేవి తో పాటు సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు..
ఇసుక సమస్య ను పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు భృతిగా నెలకు 10వేలు ఇవ్వాలని , ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలో వామపక్ష పార్టీలు తలపెట్టిన ఇసుక మార్చ్ ను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వామపక్ష నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడం వంటివి సోషలిజంతోనే సాధ్యమని అక్టోబర్ విప్లవ దినోత్సవ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని చూపించి, కార్మికవర్గం పరిపాలన చేయవచ్చని సోవియెట్ యూనియన్ ప్రపంచానికి నిరూపించిందని గుర్తుచేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలనను అధికారంలోకి తీసుకురావడంలో ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని, త్యాగాలకు దూరంగా ఉండి, బ్రిటీషు వారికి ఊడిగం చేసిన ఆరెస్సెస్‌కు...
ఇసుక కొరత వల్ల పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సిపిఎం అండగా ఉంటుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారి కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.10వేలు పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే తదుపరి...
బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖ నగరం మద్దిలపాలెం కూడలిలో రాస్తా రోకో నిర్వహిస్తున్న cpi,cpm పార్టీలు.
ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ ప్రత్యా మ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన మహాగర్జన కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున జరుగుతోంది. బిఆర్టిఎస్ రోడ్డులో మధురానగర్ వద్ద ఇప్పటికే సభావేదికను సిద్ధం చేశారు. పలు జిల్లాల నుండి కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు. అనంతపురం, చిత్తూరు నుండి రెండు ప్రత్యేక రైళ్లు బయలు దేరాయి. మహాగర్జన బహిరంగసభలో పాల్గొ నేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ నగరానికి చేరుకున్నారు.సభకు ముందు నగరంలో రెండు మహా ప్రదర్శనలు జరగనున్నాయి. రైల్వేస్టేషన్ నుండి సాంబమూర్తిరోడ్డు మీదుగా ఒక ప్రదర్శన, గుణదల ఇఎస్ఐ ఆస్పత్రి నుండి మరోప్రదర్శన ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని...
భారత్‌బంద్‌లో భాగంగా విజయవాడలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంక్‌లు మూతపడగా, దుకాణాలు మూసే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. బంద్ వాతావరణం స్పష్టంగా కనిపించింది.
విజయవాడలో సెప్టెంబర్ 15న నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో బస్సు యాత్ర చేపట్టారు. ముందుగా బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.రాఘవులు మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి విధానాలు రాష్ట్రంలో ఒకే విధంగా ఉన్నాయన్నారు. టిడిపి, వైసిపిలు ఇంతవరకూ చాలా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాయి కాని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోయాయని, ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోయాయని దుయ్యబట్టారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్న...