March

అదానీ ఒప్పందాలు రద్దు చేయాలి పోర్టులు ప్రభుత్వ పరం చేయాలి మోదాని పుస్తకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

సమ్మె హెచ్చరిక

రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో రోడ్డెక్కారు. ఇంత పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడం, వివిధ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వారు భాగస్వాములు కావడం, అనేక రాష్ట్రాల్లో బంద్‌ వాతావరణం నెలకొనడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి.

పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రేపు 31 మార్చి 2022 రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వామపక్ష పార్టీల పిలుపు

మరో నిరంకుశ చర్య

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్‌ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920) ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది.

Pages

Subscribe to RSS - March