District News

శ్రీకాకుళం జిల్లాలో పోలాకి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వెళ్లిన సిపిఎం  నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్ర‌యోగించింది. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి మ‌ధుని దౌర్జన్యంగా  అరెస్ట్ చేసారు. ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్ప‌టికే స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప‌లు ఉద్య‌మాలు సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు విన‌డానికి వెళ్లాల‌నుకున్ననాయకుల సమాచారం ముందుగానే  తెలుసుకుని రైల్వే స్టేష‌న్ లో దిగ‌గానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో అరబిందో పరిశ్రమ వద్ద బుధవారం నిర్వహిచిన 'కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణలను, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను, సామాజిక సంక్షేమ పథకాల నిధుల్లో కోతను విరమించాలని డిమాండ్‌ చేశారు. ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ పరిష్కారంలో చర్చల పేరుతో అరబిందో ఫార్మా, నాగార్జున అగ్రికమ్‌, ఆంధ్రా ఆర్గానిక్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, శ్యాంపిస్టన్‌ 2, 3, వరం పవర్‌ ప్లాంట్‌, ఫ్రింజ్‌ లేబోరేటరీస్‌, స్మార్ట్‌కమ్‌ యాజమాన్యాలు నెలల తరబడి...

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు. ఆరు థర్మల్‌ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి తోడు 'అణు...

రైతుల భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్‌ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు. రైతులనుంచి తీసుకున్న భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు....

అణు కేంద్రాలు సీసాలో బంధించిన పెను భూతాలని, ఎప్పుడు ప్రమాదమొస్తుందో తెలియదని, ప్రమాదం సంభవిస్తే ఎవరూ రక్షించలేరని భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ అన్నారు. కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వాన శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో కొవ్వాడ అణుపార్కుపై అణు నిపుణులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సోమవారం చర్చా వేదిక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, అణు వ్యర్థాలు అత్యంత విషతుల్యమని, ప్రమాదకరమని, సాంకేతికంగా వాటికి పరిష్కారం లేదని తెలిపారు. జపాన్‌లోని ఫుకుషిమాలో అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఆ దేశంలోని అణు ప్రాజెక్టులను మూసివేశారన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుండా...

సెక్షన్‌-8కి తాను వ్యతిరేకినని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అందరికీ సొంతిళ్లు వంటిదని, ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించాలనడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అప్పుడు సెక్షన్‌ 8 అవసరం వస్తుందని చెప్పారు. సెక్షన్‌ 8ను ప్రవేశపెట్టి కొత్త రాష్ట్రం ఇచ్చిన ఆనందాన్ని హరించొద్దని ఆయన అన్నారు. అవసరమైతే దీనికోసం హైదరాబాద్‌లో ఓ కేంద్ర కార్యాలయాన్ని పెట్టండి. ఓ ఐపీఎస్‌ అధికారికి దాని పర్యవేక్షక బాధ్యతలను అప్పగించండి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జవాబు చెప్పేలా చేయండి..' అని అన్నారు.

Pages